ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: నిజ్జర్ హత్యపై కెనడా ముసలి కన్నీరు.. ఆ దేశ పార్లమెంటులో నివాళి

ABN, Publish Date - Jun 19 , 2024 | 01:24 PM

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) 2023 జూన్ 18న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతను మరణించి మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తైంది. హర్దీప్ హత్య వెనక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడా.. ఒక ఉగ్రవాది మృతిపై ముసలి కన్నీరు కారుస్తోంది.

ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) 2023 జూన్ 18న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతను మరణించి మంగళవారానికి సరిగ్గా ఏడాది పూర్తైంది. హర్దీప్ హత్య వెనక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న కెనడా.. ఒక ఉగ్రవాది మృతిపై ముసలి కన్నీరు కారుస్తోంది. జూన్ 18న హర్దీప్‌కి ఆ దేశ ఎంపీలు పార్లమెంటులో నివాళులర్పించారు. ఎంపీలంతా లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఏకంగా పార్లమెంటులో ఈ సంతాపం తెలపడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రూడో తీరుపట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ‘ఒక దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు పార్లమెంట్‌లో నివాళి అర్పించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావచ్చు’ అని నెటిజన్లు కెనడాపై విరుచుకుపడుతున్నారు.


ఖలిస్థానీల ఓట్లు పొందెందుకు కెనడా ప్రభుత్వం ఇదంతా చేస్తోందని.. ఓట్లు కోసం ఒక ఉగ్రవాదికి అండగా నిలవడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గతేడాది బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా బయట గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్‌‌ని హత్య చేశారు.

ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్ - కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు భారతీయులను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు.


నిజ్జర్ చరిత్ర ఇదే..

హర్దీప్ సింగ్ నిజ్జర్ భారతదేశంలోని జలంధర్‌లో ఉన్న భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందినవాడు. 1997లో ఇతను పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ ప్లంబర్‌గా వృత్తిలో చేరాడు. ఇతనికి పెళ్లయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కెనడాలో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఖలిస్తానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నాడు.

ఖలిస్టాన్ టైగర్ ఫోర్స్ (KTF) (నిషేదిత ఉగ్రవాద సంస్థ) ఏర్పాటు వెనుక అతడే మాస్టర్ మైండ్. అంతేకాదు.. సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ)లోనూ అతడు సభ్యుడు. 2007లో పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్.


ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 2009లో రాష్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలోనూ నిజ్జర్ పాత్ర ఉంది. 2020లో నిజ్జర్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. గతేడాది జులైలో జలంధర్‌లో హత్యకు గురైన పూజారి కేసులోనూ నిజ్జర్ ప్రమేయం ఉందని తేలడంతో.. అతడ్ని పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించింది. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 19 , 2024 | 01:30 PM

Advertising
Advertising