ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Caroline Levitt: 27 ఏళ్ల యువతికి ఛాన్స్ ఇచ్చిన ట్రంప్.. కారణమిదే...

ABN, Publish Date - Nov 16 , 2024 | 09:15 AM

తన రాబోయే పరిపాలనలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పాత్రను 27 ఏళ్ల కరోలిన్ లెవిట్ పోషిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు కరోలిన్ లీవిట్‌ను స్మార్ట్, టఫ్, అత్యంత నైపుణ్యం కలిగిన కమ్యూనికేటర్ అని ట్రంప్ అభివర్ణించారు.

Caroline Levitt

ఇటివల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ (donald trump) పదవుల విషయంలో కీలక ప్రకటన చేశారు. తన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా 27 ఏళ్ల యువతి కరోలిన్ లెవిట్‌ను (Caroline Levitt) ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ పదవికి ఎంపికైన అతి చిన్న వయస్కురాలు లెవిట్ కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు 1969లో రిచర్డ్ నిక్సన్ పరిపాలనలో 29 సంవత్సరాల వయస్సులో ఈ పదవిని నిర్వహించిన రోనాల్డ్ జెగ్లర్ పేరు మీద ఉంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంలో జాతీయ ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ అద్భుతంగా పని చేస్తారని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె తెలివితోపాటు ఆకట్టుకునే వక్త అని పేర్కొన్నారు. ఈ పదవిలో ఆమె రాణిస్తుందని, అమెరికన్ ప్రజలకు మా సందేశాన్ని అందిస్తుందని నమ్మకం ఉందని ట్రంప్ పేర్కొన్నారు.


వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పాత్ర

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అనేది ప్రెస్ కార్ప్స్‌తో కమ్యూనికేట్ చేసే పరిపాలన విభాగం. అయితే ట్రంప్ తన మొదటి టర్మ్‌లో ఈ సంప్రదాయాన్ని మార్చారు. స్వయంగా ప్రధాన ప్రతినిధి పాత్రను పోషించే విధంగా చేశారు. 2017 నుంచి 2021 మధ్య ట్రంప్ తన మొదటి పదవీకాలంలో నలుగురు వేర్వేరు ప్రెస్ సెక్రటరీలను నియమించారు. ఆయన తరచుగా ప్రజలతో నేరుగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఆ క్రమంలో ర్యాలీలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి.


కరోలిన్ వ్యక్తిత్వం

న్యూ హాంప్‌షైర్ నివాసి అయిన కరోలిన్ లెవిట్ ట్రంప్‌కు మంచి మద్దతుదారుగా ఉన్నారు. ఆమె సూపర్ PAC అయిన MAGA Inc.కి ప్రతినిధిగా పనిచేశారు. 2022లో ఆమె న్యూ హాంప్‌షైర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి రిపబ్లికన్ ప్రైమరీలో గెలిచారు. కానీ డెమోక్రటిక్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.


ట్రంప్ పరిపాలనలో

ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో కూడా కరోలిన్ వైట్ హౌస్ ప్రెస్ ఆఫీసులో పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్‌కు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్‌కి కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. మొదటి టర్మ్‌లో ట్రంప్ ప్రెస్ సెక్రటరీలు సీన్ స్పైసర్, సారా హక్బీ శాండర్స్ జర్నలిస్టులతో వాడివేడి చర్చలు జరిపారు. స్టెఫానీ గ్రిషమ్ ఒక్క బ్రీఫింగ్ కూడా నిర్వహించలేదు. కైలీ మెక్‌నానీ మీడియాతో కమ్యూనికేట్ చేయడంలో దూకుడు వైఖరిని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోలిన్ లెవిట్ నియామకం రెండోసారి జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ట్రంప్ మరికొన్ని రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 16 , 2024 | 09:26 AM