ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైదిక ప్రార్థనలతో డెమొక్రటిక్‌ సదస్సు ప్రారంభం

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:43 AM

అమెరికాలోని చికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్‌ జాతీయ సదస్సు (డీఎన్‌సీ) మూడవ రోజు వైదిక ప్రార్థనలతో ప్రారంభమయింది.

చికాగో, ఆగస్టు 22: అమెరికాలోని చికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్‌ జాతీయ సదస్సు (డీఎన్‌సీ) మూడవ రోజు వైదిక ప్రార్థనలతో ప్రారంభమయింది. మేరీలాండ్‌లోని శివ విష్ణు దేవాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న రాకేశ్‌ భట్‌ వేద మంత్రాల నడుమ ప్రార్థనలు నిర్వహించారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకు మంచి జరిగేలా దీవించాలని ప్రార్థించారు. ‘మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే దేశం విషయంలో మనమంతా కట్టుగా ఉండాలి. అందరికీ సమన్యాయం వైపు అది మనల్ని నడిపిస్తుంది’ అని రాకేశ్‌ భట్‌ ప్రవచించారు.

బెంగళూరుకు చెందిన భట్‌ తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, తులు, సంస్కృత భాషల్లో ధారాళంగా మాట్లాడగలరు. 2013 జూలై నుంచి మేరీలాండ్‌లోని ఆలయంలో పూజారిగా ఉన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 04:43 AM

Advertising
Advertising
<