ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఆపరేషన్ చేస్తుండగా ఊహించని సీన్.. 82 ఏళ్ల వృద్ధురాలిపై..

ABN, Publish Date - Jan 11 , 2024 | 11:17 AM

ఓ రోగి పై ఓ వైద్యుడు దాడికి పాల్పడిన ఘటన ప్రస్తుతం చైనాలో వైరల్ గా మారింది. 2019 లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం

ఓ రోగి పై ఓ వైద్యుడు దాడికి పాల్పడిన ఘటన ప్రస్తుతం చైనాలో వైరల్ గా మారింది. 2019 లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కంటి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో 82 ఏళ్ల రోగిపై చైనా సర్జన్ శారీరకంగా దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఫుటేజీలో వృద్ధ మహిళ ముఖంపై చాలాసార్లు కొట్టినట్లు తెలుస్తోంది. గుయిగాంగ్‌లోని ఏయర్ చైనా ఆసుపత్రిలో ఈ ఘటన జరగింది. దీంతో వెంటనే ఆసుపత్రి అధికారులు విచారణ చేపట్టాయి. ఆసుపత్రి డీన్‌గా కూడా పనిచేస్తున్న సర్జన్‌ను సస్పెండ్ చేసింది.

డాక్టర్ దాడి చేయడంతో వృద్ధురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రి యాజమాన్యం బాధితురాలి 500 యువాన్లు ( చైనా కరెన్సీ ) అందించింది. ఆమెకు ఎడమ కన్ను సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేయాలన్నారు. దీనికి ఆమె సిద్ధమయ్యారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం గమనార్హం. డాక్టర్ చెప్పినట్లు రోగి చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


2019 డిసెంబర్ లో ఈ సంఘటన జరిగినప్పటికీ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియో కనిపించిన తర్వాత మాత్రమే విస్తృతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనను బయటకు తీసుకురావడంలో ప్రముఖ చైనా వైద్యుడు ఐఫెన్ కీలక పాత్ర పోషించారు. వుహాన్‌లో కొవిడ్-19 వ్యాప్తి గురించి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా.. ఇలాంటి ఘటనలతో వైద్య వృత్తిలో నైతిక ప్రవర్తన, ప్రమాణాలు దిగజారిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 11:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising