Attack on Trump: ట్రంప్‌పై దాడిని 4 నెలల క్రితమే జోస్యం చెప్పిన పాస్టర్.. అచ్చం అలాగే జరిగింది

ABN, Publish Date - Jul 15 , 2024 | 08:26 AM

Attack on Trump: ట్రంప్‌పై దాడిని 4 నెలల క్రితమే జోస్యం చెప్పిప పాస్టర్

Attack on Trump: ట్రంప్‌పై దాడిని 4 నెలల క్రితమే జోస్యం చెప్పిన పాస్టర్.. అచ్చం అలాగే జరిగింది

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై శనివారం జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కాల్పుల దాడికి సంబంధించిన కథనాలు వైరల్‌‌గా మారాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరుగుతుందని, ఆయన చెవి పక్క నుంచి బుల్లెట్ దూసుకెళ్తుందని ఓ క్రైస్తవ పాస్టర్ 4 నెలల క్రితమే జోస్యం చెప్పాడు.


ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పాస్టర్ అన్న మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘దేశభక్తి కొత్త కెరటం ఎగసిపడుతుంది. ఆ దేశ భక్తుల చేతుల్లో కాంతి దీపాలు ఉంటాయి. ట్రంప్ పైకి లేవడం చూశాను. ఆ తర్వాత ఆయనపై హత్యాయత్నం గ్రహించాను. అతడి తలకు దగ్గరగా, కర్ణభేరి నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. ట్రంప్ మోకాళ్లపై నిలబడి దైవాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందడం నేను చూశాను’’ అని క్రిస్టియన్ పాస్టర్ చెప్పడం వీడియోలో ఉంది. ట్రంప్‌పై జరిగిన దాడి మొత్తం అచ్చం పాస్టర్ చెప్పినట్టుగానే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాస్టర్ మూడు నెలల క్రితం ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. మార్చి 14, 2024న ఈ మేరకు ఆయన జోస్యం చెప్పారు.


కాగా ఇదే ఇంటర్వ్యూలో సదరు పాస్టర్ అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణ స్థితికి పతనమవుతుందని లెక్కగట్టారు. అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మహా మాంద్యం’ కంటే ఎక్కువగా పడిపోతుందని అన్నారు. కాగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సదరు నిందితుడిని సెకన్ల వ్యవధిలోనే మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 15 , 2024 | 08:57 AM

Advertising
Advertising
<