ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dhaka : బంగ్లాదేశ్‌లో మళ్లీ రక్తపాతం

ABN, Publish Date - Aug 05 , 2024 | 03:55 AM

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం తొలి రోజు, ఆదివారం దేశ వ్యాప్తంగా రక్తపాతానికి దారి తీసింది.

  • అల్లర్లలో 93 మంది మృతి

  • వందలాది మందికి తీవ్ర గాయాలు

  • ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా

  • డిమాండ్‌తో విద్యార్థుల నిరసనలు

  • అధికార పార్టీ శ్రేణులు, ఆందోళనకారుల

  • మధ్య ఘర్షణ హింసాత్మకం

  • 93 మంది మృతి, వందలాది మందికి గాయాలు

  • షేక్‌ హసీనా రాజీనామాకు విద్యార్థుల డిమాండ్‌

ఢాకా, ఆగస్టు 4 : బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం తొలి రోజు, ఆదివారం దేశ వ్యాప్తంగా రక్తపాతానికి దారి తీసింది.

విద్యార్థులు, అధికార అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 14 మంది పోలీసులు సహా 93 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన హోం శాఖ ఆదివారం సాయంత్రం నుంచి దేశ వ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను అమలుకు అంతేకాక, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను దేశ వ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేశారు.

అలాగే, 4జీ సేవలను కూడా ఆపేయాలని మొబైల్‌ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని హసీనా చర్చలకు ఆహ్వానించినా ఆమెతో మాట్లాడేందుకు ఆందోళనకారులు తిరస్కరించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై జరిగిన నిరసనల్లో ఇటీవల 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌తో విద్యార్థులు ఉద్యమబాట పట్టారు.

దేశ వ్యాప్తంగా హింస చెలరేగడంపై స్పందించిన ప్రధాని హసీనా షేక్‌.. విద్యార్థుల ముసుగులో టెర్రరిస్టులు హింసకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, హింసకు పాల్పడుతున్నవారిని అణిచి వేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్మీ, నేవీ, వాయుసేన చీఫ్‌లు, పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో హసీనా సమావేశమయ్యారు.

Updated Date - Aug 05 , 2024 | 03:55 AM

Advertising
Advertising
<