Trump-Kamala: ట్రంప్-కమలా హారిస్ ఫస్ట్ డిబేట్ ఫిక్స్
ABN, Publish Date - Aug 03 , 2024 | 12:50 PM
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఫస్ట్ డిబేట్‌కు తేదీ ఫిక్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగగా, డెమోక్రాట్ల తరఫున హారిస్ ఉన్నారు. వాస్తవానికి జో బైడెన్ బరిలోకి దిగారు. వయస్సు పైబడటం, మతి మరుపు వల్ల ట్రంప్‌తో సమానంగా చర్చ చేయడం లేదు. దీంతో డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. దాంతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. డెమోక్రాట తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపుగా ఖరారయ్యారు.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కమలా హారిస్ (Kamala Harris) మధ్య ఫస్ట్ డిబేట్‌కు తేదీ ఫిక్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగగా, డెమోక్రాట్ల తరఫున హారిస్ ఉన్నారు. వాస్తవానికి జో బైడెన్ బరిలోకి దిగారు. వయస్సు పైబడటం, మతి మరుపు వల్ల ట్రంప్‌తో సమానంగా చర్చ చేయడం లేదు. దీంతో డెమోక్రాట్లు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకోవాలని కోరారు. దాంతో బైడెన్ అధ్యక్ష ఎన్నిక నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. డెమోక్రాట తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపుగా ఖరారయ్యారు.
సెప్టెంబర్ 4న..
ట్రంప్- హారిస్ చేత లైవ్ డిబేట్ నిర్వహిస్తామని ఫాక్స్ న్యూస్ వెల్లడిచింది. ఈ విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4వ తేదీన జరిగే చర్చలో పాల్గొంటానని ట్రంప్ మాట ఇచ్చారట. దీంతో డొనాల్డ్ ట్రంప్- కమలా హారిస్ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పెన్సిల్వేనియాలో తొలి చర్చ జరగనుంది. చర్చ జరిగే సమయంలో చుట్టూ ప్రేక్షకులు కూడా ఉంటారు. ఆ చర్చకు బ్రెట్ బెయిర్, మార్తా మెక్‌కల్లం వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. గత చర్చ వేదికల మాదిరిగా నిబంధనలు వర్తిస్తాయని ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది.
ఓకే అన్న కమలా..
ట్రంప్‌తో చర్చకు సంబంధించి ఫాక్స్ న్యూస్ కమలా హారిస్‌కు సమాచారం అందజేసింది. ట్రంప్‌తో జరిగే డిబేట్‌కు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలియజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కమలా హారిస్‌తో చర్చ చేయాలని జూలై 21వ తేదీన ట్రంప్‌కు ఫాక్స్ న్యూస్ ప్రతిపాదన చేసింది. కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థి అధికారికంగా కాలేదని, ఆమెతో చర్చ చేయనని ఆ సమయంలో ట్రంప్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఎంపిక కావడంతో ట్రంప్ కూడా చర్చకు సై అంటున్నారు.
ట్రంప్ విమర్శలు
దాంతోపాటు కమలా హారిస్‌పై ట్రంప్ విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. అధ్యక్ష అభ్యర్థి అయ్యేందుకు ఆమెకు తగినంత సభ్యుల మద్దతు లేదని మండిపడ్డారు. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించలేదని వివరించారు. కమలా హారిస్‌కు బరాక్ ఒబామా దంపతులు అండగా ఉన్నారు. డెమోక్రాట్ల మద్దతును కమలా హారిస్ పొందారు. ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Latest International News and Telugu News
Updated Date - Aug 03 , 2024 | 12:50 PM