Donald Trump: నిక్కీ హేలీని చిత్తుగా ఓడించిన ట్రంప్.. నెక్ట్స్ అధ్యక్ష రేసులో కూడా?
ABN, Publish Date - Feb 25 , 2024 | 12:56 PM
సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(donald Trump) నిర్ణయాత్మక విజయం సాధించారు. అతను తన సొంత రాష్ట్రంలో ప్రత్యర్థి నిక్కీ హేలీని ఓడించిన నేపథ్యంలో వైట్ హౌస్ పోటీలో జో బైడెన్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నారు.
అమెరికా(america)లోని సౌత్ కరోలినాలో శనివారం జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్(donald Trump) నిక్కీ హేలీ(Nikki Haley)ని ఈజీగా ఓడించారు. సౌత్ కరోలినా(South Carolina) మాజీ గవర్నర్ నిక్కీ హేలీని ఆమె సొంత రాష్ట్రంలోనే ఓడించడం విశేషం. మొదటి నాలుగు ప్రధాన నామినేషన్ పోటీల్లో ట్రంప్ విజయం సాధించారు. దీంతో వచ్చే నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జో బైడెన్‌కు గట్టి పోటీ ఇవ్వనున్నారు.
ఈ ఎన్నికలకు ముందు అధ్యక్ష పోటీదారులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాగా సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్(donald Trump) విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో మొత్తం 75 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో ట్రంప్‌కు 54.4 శాతం ఓట్లు రాగా, హేలీకి 43.3 శాతం ఓట్లు వచ్చాయి.
ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రజలు(people) మంచి మద్దతు పలికారని చెప్పవచ్చు. ఎన్నికల తర్వాత వచ్చిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో కూడా ట్రంప్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. నేరారోపణలు ఉన్నప్పటికీ, ట్రంప్ ఇక్కడ పెద్ద ఆధిక్యం సాధించారు. రెండుసార్లు గవర్నర్ ఎన్నికల్లో విజయం సాధించిన సౌత్ కరోలినాకు చెందిన హేలీ ట్రంప్‌ను ఓడించలేకపోయారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు సవాల్ విసిరిన ఏకైక అభ్యర్థి హేలీ. ఈ ఓటమి తర్వాత ఆమె అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఐయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, ఇప్పుడు హేలీ సొంత రాష్ట్రం సౌత్ కరోలినా ఇప్పటి వరకు మొత్తం ఐదు పోటీలలో ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Sudarshan Setu Bridge: దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు బ్రిడ్జ్‌ని ప్రారంభించిన ప్రధాని మోదీ..వీడియో
Updated Date - Feb 25 , 2024 | 12:56 PM