Donald trump: అధికారంలోకి వస్తే వారిని ఉరి తీయిస్తా.. డొనాల్డ్ ట్రంప్ సంచలనం
ABN, Publish Date - Oct 12 , 2024 | 06:48 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల(US President Elections 2024) బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల(US President Elections 2024) బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా పౌరులను చంపిన వలసవాదులకు మరణశిక్ష విధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలరాడో రాష్ట్రం అరోరాలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ ప్రసంగించారు.
"అమెరికాను ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. అమెరికాను ప్రపంచ దేశాలు ఆక్రమిత ప్రాంతంగా పిలుస్తున్నాయి. నేను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వలసవాదులే లక్ష్యంగా జాతీయ ఆపరేషన్ అరోరాను మొదలుపెడతా. నవంబర్ 5ను అమెరికా విముక్తి దినోత్సవంగా మారుస్తాం. అమెరికన్ పౌరులను, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసవాదులకు ఉరిశిక్ష విధిస్తాం. ఆరోరాను వేధిస్తున్న వెనెజువెలా గ్యాంగ్ ట్రెన్ డె అరగువా సభ్యుల ఏరివేతపై ప్రత్యేకంగా దృష్టి పెడతా. అరోరా నుంచి అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రతి పట్టణాన్ని రక్షిస్తా. ప్రమాదకరమైన నేరస్థులను దేశం నుంచి తడిమికొడతాం. దక్షిణ సరిహద్దులో మెక్సికోతో అమెరికా చాలా ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అందువల్లే ఆ ప్రాంతంలో చొరబాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని సమస్యలను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పరిష్కరిస్తా" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోటాపోటీ ప్రచారంతో రాజకీయాలు వేడెక్కాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News
Updated Date - Oct 12 , 2024 | 06:49 PM