ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే బుల్లెట్ దూసుకెళ్లింది!

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:15 AM

పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జరిగిన ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ప్రాణాలను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ``గాడ్ బ్లెస్ అమెరికా`` అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Donald Trump

పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జరిగిన ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ప్రాణాలను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ``గాడ్ బ్లెస్ అమెరికా`` అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాల్పులు జరిపినపుడు ఓ బుల్లెట్ తన చెవి పై నుంచి వెళ్లిందని వెల్లడించారు.


``కాల్పుల సమయంలో వేగంగా స్పందించి నా ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్‌తో ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు. ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదు. కాల్పులు జరిగిన వ్యక్తి గురించి నాకేం తెలియదు. కాల్పుల శబ్దం వినిపించినపుడు నాకేం అర్థం కాలేదు. అంతలోనే ఓ బుల్లెట్ నా చెవి పై నుంచి వెళ్లిపోయింది. చాలా రక్తస్రావం జరిగింది. ఈ కాల్పుల ఘటనలో మరణించిన వ్యక్తికి, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తికి నా సానుభూతి తెలియజేస్తున్నా. గాడ్‌బ్లెస్ అమెరికా`` అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు.


పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రంప్ చెవి పై నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయనకు గాయమై రక్తస్రావం అయింది. బుల్లెట్ నేరుగా ట్రంప్ పైకే దూసుకెళ్లడంతో ఇది ఆయనపై జరిగిన హత్యాయత్నంగానే భావిస్తున్నారు. ట్రంప్‌ చుట్టూ వలయంలా ఏర్పడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను సురక్షితంగా కారు ఎక్కించి పంపించేశారు. అలాగే కాల్పులకు తెగబడిన దుండగుడిని మట్టుబెట్టారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. కగా, ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

Updated Date - Jul 14 , 2024 | 03:53 PM

Advertising
Advertising
<