ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: విజయం సంపూర్ణం.. ఆ ఒక్కటీ ఖాతాలోకి.. ఇదీ ట్రంప్ అంటే

ABN, Publish Date - Nov 10 , 2024 | 09:50 AM

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఆయన విజయం సంపూర్ణమైంది. మిగిలిన ఆ ఒక్కటీ ఆయన ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇదీ విజయమంటే, ట్రంప్ మామూలోడు కాదని ఆయన అభిమానులు, ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ఆయన విజయం సంపూర్ణమైంది. మిగిలిన ఆ ఒక్కటీ ఆయన ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఇదీ విజయమంటే, ట్రంప్ మామూలోడు కాదని ఆయన అభిమానులు, ప్రజలు ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయన అకౌంట్‌లో చేరిన ఆ ఒక్కటీ మరేదో కాదు కీలకమైన ఆరిజోనా రాష్ట్రం. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో భాగంగా స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన ఆరిజోనాను ట్రంప్ గెలుచుకున్నారు. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్లను దక్కించుకోవడంతో ఆయనకు వచ్చిన ఓట్లు 312కు చేరాయి. దీంతో అమెరికాలోని ముఖ్యమైన ఏడు స్వింగ్ స్టేట్స్ ట్రంప్ వశమయ్యాయి.


ఇదే తొలిసారి

డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మొత్తంగా 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల నుంచి ఆరిజోనాను నెగ్గిన వ్యక్తిగా జో బైడెన్ నిలిచారు. కానీ ఈసారి తిరిగి ఆరిజోనాను సొంతం చేసుకున్నారు ట్రంప్. ఏకంగా ఏడు స్వింగ్ స్టేట్స్‌ను వశం చేసుకొని ఔరా అనిపించారు. ఆరిజోనా ఫలితం ఆఖర్లో తేలగా.. అంతకంటే ముందు నెవడా స్టేట్ రిజల్ట్ వచ్చింది. ఇందులో ట్రంప్ విజయదుందుభి మోగించారు. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ నెగ్గిన తర్వాత రిపబ్లికన్ అభ్యర్థి నెవడాను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆరిజోనాలోనూ విక్టరీతో ట్రంప్ విజయం పరిపూర్ణమైంది.


హత్యకు కుట్ర

అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కాసేపు పక్కనబెడితే.. ట్రంప్‌ను హత్య చేయాలనే ఇరాన్ కుట్ర కోణం తాజాగా బయటపడింది. ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ ర్యాలీ సందర్భంగా ట్రంప్‌ను చంపాలన్న ఇరాన్ కుట్రలో భాగస్వామ్యులైన ఇద్దరు అమెరికన్లను అదుపులోకి తీసుకున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఓ ఆఫీసర్ ఇందులో కీలకపాత్ర పోషించాడని అమెరికా న్యాయవిభాగం పేర్కొంది.


Also Read: .

శివారు ప్రాంతాలపై మళ్లీ దాడులు.. పిల్లలతో సహా 40 మంది మృతి

డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పక్క దేశాల భయాందోళన.. కారణమిదేనా..

For More International And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 10:10 AM