ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: ఎలాన్ మస్క్ అభయహస్తం! భారత్‌కు ఇక కెనడా ప్రధానితో ఇబ్బందులు తప్పినట్టే

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:16 PM

వచ్చే ఎన్నికల తరువాత కెనడా ప్రధాని ట్రూడో తెరమరుగవుతారంటూ మస్క్ తాజాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్న మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అవతరించారు. డొనాల్డ్ ట్రంప్‌ తరుపున ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆయన విజయానికి బాటలు పరిచారు. మస్క్ అనితరసాధ్యుడంటూ ట్రంప్ వేనోళ్ల పొగిడేలా చేశారు. ఎన్నికల్లో విజయం తరువాత ట్రంప్ తన కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలో మస్క్ కూడా ఉండటం ఆయన ప్రాధాన్యానికి అద్దం పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో, అనేక మంది అంతర్జాతీయ వ్యవహారాలను మస్క్ దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా స్వీడెన్ జర్నలిస్టు ఒకరు మస్క్‌కు చేసిన రిక్వెస్ట్‌కు ఆయన ఊహించని రీతిలో రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా (Viral) మారింది.

Viral: లీవ్ ఇవ్వని బాస్.. వీడియో కాల్‌‌‌లో పెళ్లి చేసుకున్న యువకుడు


ఇటీవల స్వీడెన్ జర్నలిస్టు ఒకరు జర్మనీ రాజకీయ పరిణామాలను ఎక్స్ వేదికగా మస్క్ దృష్టికి తీసుకెళ్లారు. ఓలాఫ్ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని, సోషలిస్టు ప్రభుత్వం కుప్పకూలొచ్చని జోస్యం చెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందిస్తూ ‘జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ ఓ మూర్ఛుడు’ అని రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో మరో వ్యక్తి కెనడా ప్రస్తావన తెచ్చారు. కెనడాలో ప్రధాని ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయాలని అభ్యర్ధించారు. దీనిపై మస్క్ స్పందిస్తూ వచ్చే ఎన్నికల తరువాత అతడు తెరమరుగవుతాడని జోస్యం చెప్పారు. దీంతో, ఈ పోస్టు నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. కెనడా ప్రధానికి ఓటమి తప్పదన్న కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

Viral: స్కూల్లో జరిగేదేంటో తెలుసుకునేందుకు కూతురి ఆటబొమ్మలో సీక్రెట్ కెమెరా


అయితే, ట్రూడోపై మస్క్ గతంలోనూ దుమ్మెత్తిపోశారు. కెనడాలో భావప్రకటనాస్వేచ్ఛ గొంతు నొక్కుతున్నారని ట్రూడోను విమర్శించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్ సర్వీసులు కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ట్రూడో గతేడాది ఓ నిబంధన తీసుకొచ్చారు. దీనిపై మస్క్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అంతకుమునుపు 2022లో ప్రధాని ట్రూడో ఎమర్జెన్సీ నిబంధనలను ప్రయోగించినప్పుడు కూడా మస్క్ గయ్యిమన్నారు. ట్రక్ డ్రైవర్ల నిరసనలను నియంత్రించేందుకు ఎమర్జెన్సీ రూల్స్‌ను వాడటంపై తీవ్ర అభ్యంతరం చేసిన మస్క్ ట్రూడోను హిట్లర్‌తో పోల్చారు. ఇదే విషయంలో ట్రంప్ కూడా ట్రూడోను వామపక్ష అతివాదిగా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ట్రూడో సమస్య తప్పినట్టే అంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

Read Latest and International News

Updated Date - Nov 08 , 2024 | 12:23 PM