ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Colorado airshow: ఒకేసారి 100 మందికి వడదెబ్బ..

ABN, Publish Date - Aug 19 , 2024 | 06:36 AM

విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్‌షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు.

ఇంటర్నెట్ డెస్క్: విపరీతమైన వేడి గాలుల ప్రభావంతో ఎయిర్‌షోని(Colorado airshow) వీక్షిస్తున్న జనం ఒక్కసారిగా కుప్పకూలారు. వారందరికి వడదెబ్బ(Sun Stroke) తగిలిందని వైద్యులు నిర్ధారించారు. సుమారు 100 మందికిపైగా బాధితులు ఆసుపత్రులకు క్యూ కట్టారని తెలిపారు. అమెరికా కొలరాడో రాష్ట్రంలోని ఓ ఎయిర్ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది.

డెన్వర్‌ నగరానికి దక్షిణాన 130 కి.మీ.ల దూరాన గల కొలరాడో స్ప్రింగ్స్‌ మున్సిపల్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ షో నిర్వహించారు. అంతకుముందే కొలరాడోలోని ప్యూబ్లోలోని నేషనల్ వెదర్ సర్వీస్.. శనివారం మధ్యాహ్నం ప్రాంతంలో 93 - 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (33.8 - 37.7 సెల్సియస్) మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలను జారీ చేసింది. వాటిని పట్టించుకోని ఎయిర్ షో యాజమాన్యం.. కార్యక్రమాన్ని నిర్వహించింది.


వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి రావడం.. ఎండలు మండిపోయేలా ఉండటంతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండ వేడికి తాలలేక కుప్పకూలారు. అలా 100 మందికిపైగా స్పృహ కోల్పోయారు. వారందరినీ సమీపంలోని 8 వేర్వేరు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఎమర్జన్సీ సిబ్బంది తక్షణం స్పందించటంతో పెను ప్రమాదం తప్పిందని కొలరాడో స్ప్రింగ్స్‌ ఫైర్‌ చీఫ్‌ రాండీ రాయల్‌ తెలిపారు. శని, ఆదివారాల కోసం ఎయిర్‌షో టికెట్లు విక్రయించారని చెప్పారు. ఈ ఎయిర్‌షోలో కొత్త, పాతకాల విమానాలను ప్రదర్శించారు. శనివారం ఎండలు మండిపోవడంతో ఆదివారం తగు జాగ్రత్తలు తీసుకున్నా.. పరిస్థితి అదుపుతప్పింది. వీరిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురికాగా వారిని ఆసుపత్రుల్లోని అత్యవసర వైద్యవిభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు రాండీ రాయల్ చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 06:36 AM

Advertising
Advertising
<