ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains And Floods: పలు నగరాలను మంచెత్తిన భారీ వర్షాలు, వరదలు

ABN, Publish Date - Oct 30 , 2024 | 01:57 PM

స్పెయిన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ నగరాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో వేలాది కార్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకోవడంతో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

మాడ్రిడ్, అక్టోబర్ 30: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్పెయిన్‌లోని ఆగ్నేయ ప్రాంతం జల దిగ్బంధనంలో చిక్కుక పోయింది. దీంతో వాలెన్సియా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. అలాగే ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అయితే ఈ వర్షాల దాటికి పలువురు మరణించారని స్థానిక నాయకుడు కార్లోస్ మజోన్ బుధవారం వెల్లడించారు. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు వాతావరణం సైతం వెంట వెంటనే మారిపోతుందని తెలిపారు. ఇక భారీ వర్షాలకు పలువురు మరణించారు. అలాగే పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వారి కోసం ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది.

Also Read: Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు


ఇక ఈ భారీ వర్షాలతో స్పెయిన్‌లోని పశ్చిమ, తూర్పు ప్రాంతాలను సైతం వరద నీరు ముంచెత్తింది. దీంతో వీధులన్నీ వరద నీటితో నిండిపోయాయి. అలాగే రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. వేలాది కార్లు సైతం ఆ వరద నీటిలో కొట్టుకు పోయాయి. దీంతో వాహనాల్లోకి భారీగా బురద వచ్చి చేరింది. అయితే 200 మి. మీటర్ల వర్ష పాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు.

Also Read: ఆలూ చిప్స్‌.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?


సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు ఈ భారీ వర్షాలు, వరదలపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టడం, నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు వారిని రక్షించేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. అలాగే ఈ విపత్తు నేపథ్యంలో ప్రజలను ఆదుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పానిష్ ప్రభుత్వం ఒక కమిటీని అత్యవసరంగా ఏర్పాటు చేసింది.

Also Read: Choti Diwali 2024: చోటి దీపావళి వేళ.. ఇలా..


అలాగే సైన్యంతోపాటు భద్రత సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. అలాగే వరద నీటిలో చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు డ్రోన్లు, హెలికాఫ్టర్లను సైన్యం రంగంలోకి దింపింది. ఇంకోవైపు భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో రైళ్లు, బస్ సర్వీసులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది. అలాగే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. అదే విధంగా వివిధ సర్వీసులను దారి మళ్లించి నడుపుతున్నారు.

Also Read: Reliance: పండగ వేళ.. రిలయన్స్ ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్.. షాక్‌లో నెటిజన్లు


అండలూసియాలో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక అలోరాలోని నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆ నది పరివాహక ప్రాంతంలోని వారిని హెలికాఫ్టర్ సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయిని ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరించింది.

Also Read: ICAI: నేడు సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల

For International News And Telugu News..

Updated Date - Oct 30 , 2024 | 02:01 PM