Share News

Israel-Hezbollah War: ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో హిజ్బుల్లా దాడి

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:57 PM

దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్దోద్ నావికా స్థావరంలోపై డ్రోన్లతో దాడి చేసినట్టు హిబ్జుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ శివార్లలోని గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ బేస్‌పై కూడా క్షిణపలు ప్రయోగించినట్టు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో దాడి జరిగినట్టు ఆదేశ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.

Israel-Hezbollah War: ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో హిజ్బుల్లా దాడి

బీరుట్: ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం (Israel-Hezbollah War) అంతకంతకూ తీవ్రమవుతోంది. దక్షిణ బీరుట్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు ప్రతిగా హిజ్బుల్లా ఆదివారం విరుచుకుపడింది. లెబనాన్ సరిహద్దుల నుంచి ఒకేసారి 250 రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) కొన్ని రాకెట్లను మధ్యలోనే కూల్చివేయగా, మరికొన్ని సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఇళ్లను ధ్వంసం చేశాయి. టెల్ అవీవ్‌లోని సైనిక స్థావరం లక్ష్యంగా కూడా హిజ్బుల్ దాడులు జరిపినట్టు ఏఎఫ్‌బీ తెలిపింది.

నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌


దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్దోద్ నావికా స్థావరంలోపై డ్రోన్లతో దాడి చేసినట్టు హిబ్జుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ శివార్లలోని గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ బేస్‌పై కూడా క్షిణపలు ప్రయోగించినట్టు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో దాడి జరిగినట్టు ఆదేశ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఇజ్రెయిల్ ఫారెన్ మినిస్ట్రీ ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేసింది.


అక్టోబర్ 2023 నుంచి ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 3,754 మంది మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల్లో 82 మంది సైనికులు, 47 మంది పౌరులు మృతిచెందారు. కాగా, తక్షణం ఇజ్రాయెల్-హిబ్జుల్లా కాల్పుల విరమణ జరపాలని పిలుపునిస్తూ ఈయూ డిప్లొమేట్ జోసఫ్ బోరెల్ ఆదివారంనాడు లెబనాన్‌లో పర్యటించారు. బీరుట్‌లో పార్లమెంటరీ స్పీకర్ నిబిహ్ బెర్రితో చర్చలు జరిపారు. కాల్పులు విరమించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701ని అమలు చేయాలని ఆయన కోరారు. ఈవారం మొదట్లో అమెరికా ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ సైతం లెబనాన్‌లో పర్యటించి, యుద్ధానికి ముగింపు పలికేందుకు చర్చలు సాగించారు. అనంతరం ఆయన ఇజ్రాయెల్ వెళ్లారు.


ఇవి కూడా చదవండి..

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

రష్యాలో ఏం జరుగుతోంది?

For More International And Telugu News

Updated Date - Nov 25 , 2024 | 04:57 PM