ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెతన్యాహుపై ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌

ABN, Publish Date - Nov 22 , 2024 | 06:47 AM

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలంట్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అరెస్ట్‌ వారెంట్లు జారీ

ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి గాలంట్‌పైనా.. హమాస్‌ నాయకులకు కూడా వారెంట్లు జారీ చేసిన ఐసీసీ

యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు

యూదులపై ద్వేషంతో ఇచ్చిన వారెంట్లుగా అభివర్ణించిన ఇజ్రాయెల్‌

గాజా, టెల్‌ అవీవ్‌, ది హేగ్‌, నవంబరు 21: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి గాలంట్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. 2023 అక్టోబరు 8 నుంచి 2024 మే 20 మధ్య పాల్పడిన యుద్ధ నేరాలకు సంబంధించి ఈ వారెంట్లు జారీ చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. మానవత్వానికి వ్యతిరేకంగా గాజాలోని ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం, నీరు, ఔషదాలు దూరం చేశారని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. నెతన్యాహు, గాలంట్‌లకు అరెస్ట్‌ వారెంట్లు ఇవ్వాలని ఐసీసీ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ డిమాండ్‌ చేయగా ఇజ్రాయెల్‌, అమెరికా తేలిగ్గా తీసుకున్నాయి. ఇప్పుడు మాత్రం యూదులకు వ్యతిరేకంగా ద్వేషం, పక్షపాతంతో ఇచ్చిన వారెంట్లుగా ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఆరోపించింది.

హమాస్‌ నేతలకూ అరెస్ట్‌ వారెంట్లు

హమాస్‌ నాయకులు యాహ్యా సిన్వర్‌, ఇస్మాయిల్‌ హనియే, సైనిక కమాండర్‌ మహ్మద్‌ డెయి్‌ఫపై కూడా అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడిలో 1139 మంది ఇజ్రాయెలీలను చంపడం ద్వారా యుద్ధ నేరాలకు పాల్పడ్డారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే డెయి్‌ఫను గత జూలైలోనే వైమానిక దాడిలో హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతూ వస్తోంది. యాహ్యా సిన్వర్‌, ఇస్మాయిల్‌ హనియేలను ఇప్పటికే మట్టుబెట్టింది.

44వేలకు పెరిగిన మృతులు

గత ఏడాది అక్టోబరు 7న తమపై హమాస్‌ జరిపిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ గాజాలో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 44 వేలు దాటింది. లక్షా 4 వేల మంది గాయపడ్డారు. మరోవైపు 17 వేల మంది ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. హమాస్‌ అపహరించిన బందీలను విడిచిపెడితే దాడులు ఆపేస్తామని ప్రకటించింది. హమాస్‌ అపహరించిన 250 మందిలో కొందరిని విడిచిపెట్టగా ఇంకా 101 మంది బందీలు వారి చెరలోనే ఉన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 06:47 AM