Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’
ABN, Publish Date - Apr 30 , 2024 | 11:20 AM
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై...
భారతదేశంపై (India) ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ (Pakistan) స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి (G20 Summit) ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టింది. తాజాగా పాక్‌కు చెందిన ప్రముఖ మితవాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ (Maulana Fazlur Rehman) సైతం ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్‌లకు ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చిందన్న ఆయన.. భారత్ సూపర్‌పవర్‌గా ఎదగాలని కలలు కంటోందని, మనం మాత్రం అప్పుల బెడద నుంచి బయటపడేందుకు భిక్షాటన చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం అక్కడి జాతీయ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాత్రి కన్న ‘కలే’ ఆమె ప్రాణాలు కాపాడింది.. అసలు ఏమైందంటే?
‘‘ఒకసారి మన పాకిస్తాన్‌ని భారత్‌తో పోల్చి చూస్తే.. రెండు దేశాలకూ ఒకే సమయంలో స్వాతంత్రం వచ్చింది. అయితే.. భారత్ ఈరోజు సూపర్‌పవర్‌గా ఎదగాలని కలలు కనే స్థాయికి చేరింది. కానీ మనం ఇంకా అప్పుల బెడద నుంచి బయటపడటం కోసం ప్రపంచ దేశాల ముందు భిక్షాటన చేస్తున్నాం’’ అని రెహ్మాన్ చెప్పుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చడం వల్లే పాక్‌కి ఈ దుస్థితి ఏర్పడిందని.. దీని వెనుక అదృశ్య శక్తులే కారణమని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యులు కూడా తమ సూత్రాలను వదిలి. ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. ఇస్లాం పేరుతో ఒక ప్రత్యేక దేశాన్ని సంపాదించుకోగలిగాం కానీ, ఈరోజు మనం సెక్యులర్ రాజ్యంగా మారామని అన్నారు. 1973 నుంచి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (CII) సిఫార్సుల్లో ఒక్కటి కూడా అమలు చేయబడలేదని.. అలాంటప్పుడు పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?
ఇదే సమయంలో.. తన మాజీ ప్రత్యర్థి పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్‌కు (Pakistan Tehreek-E-Insaaf) రెహ్మాన్ మద్దతుగా నిలిచారు. ఆ ప్రతిపక్ష పార్టీకి ర్యాలీలు నిర్వహించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఉందని నొక్కి చెప్పారు. తాము 2018 ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తామని, ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశామని అన్నారు. 2018 ఎన్నికల్లో అవతవకలు జరిగినప్పుడు.. ప్రస్తుత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో పీటీఐకి మెజారిటీ లభిస్తే.. ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని రెహ్మాన్ కోరారు.
Read Latest International News and Telugu News
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 30 , 2024 | 11:38 AM