ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Typhoon: టైఫూన్ తుపాన్ విధ్వంసం.. ఆ దేశాలకు మానవతా సాయాన్ని చేరవేసిన భారత్

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:01 PM

టైఫూన్ యాగి(Typhoon Yagi) తుపాన్ ప్రభావానికి గురైన మియన్మార్, లావోస్, వియత్నాంలకు భారత్ అత్యవసర సహాయ సామగ్రిని చేరవేసింది. ఈ కార్యక్రమానికి సద్భవ్ అని అధికారులు నామకరణం చేశారు.

ఢిల్లీ: టైఫూన్ యాగి(Typhoon Yagi) తుపాన్ ప్రభావానికి గురైన మియన్మార్, లావోస్, వియత్నాంలకు భారత్ అత్యవసర సహాయ సామగ్రిని చేరవేసింది. ఈ కార్యక్రమానికి సద్భవ్ అని అధికారులు నామకరణం చేశారు. ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన తుపానుగా రికార్డుకెక్కిన యాగి.. మయన్మార్, లావోస్, వియత్నాంలను తాకడంతో ఆయా దేశాలు చిగురుటాకుల వణికాయి. భారత నౌక ఐఎన్ఎస్ సత్పురాలో మియన్మార్‌కు డ్రై రేషన్, దుస్తులు, మందులతో సహా 10 టన్నుల సామగ్రిని పంపినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

భారత వైమానిక దళానికి చెందిన సైనిక రవాణా విమానం వియత్నాంకు 35 టన్నులు, లావోస్‌కు 10 టన్నుల మేర సామగ్రిని తరలించినట్లు చెప్పారు. "భారత్ #OperationSadbhav ను ప్రారంభించింది. బాధితులకు భారత ప్రభుత్వం తరఫున సంఘీభావం తెలుపుతున్నాం. మియన్మార్, వియత్నాం, లావోస్‌లకు భారత్ అన్నివేళలా సాయం అందిస్తుంది. నీటి శుద్ధి వస్తువులు, కంటైనర్లు, దుప్పట్లు, వంట పాత్రలు, సోలార్ లాంతర్‌లతో కూడిన 35 టన్నుల సహాయాన్ని వియత్నాంకు తరలిస్తున్నాం. లావోస్‌కు నీటి శుద్ధి వస్తువులు, దోమ తెరలు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లతో కూడిన 10 టన్నుల సహాయాన్ని చేరవేశాం " అని జైశంకర్ ఎక్స్‌లోని ఓ పోస్ట్‌లో తెలిపారు.


తీరని నష్టం..

వియత్నాం, మియన్మార్, లావోస్‌లను టైఫూన్ యాగి తుపాను వణికించింది. భారీ వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రజలు చనిపోయారు. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ఆసియాను తాకిన అత్యంత శ‌క్తివంత‌మైన తుపాన్‌గా టైఫూన్ రికార్డుకెక్కింది. గత శ‌నివారం ఇది వియ‌త్నంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో గంటకు 203 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వియత్నాం తీర ప్రాంతంలో ఉన్న సుమారు 50 వేల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు ఇప్పుడు మానవతాసాయం కోసం ఎదురు చూస్తున్నాయి.

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 08:01 PM

Advertising
Advertising