ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

International Students: ఇకపై కెనడాకు వెళ్లే విద్యార్థులకు మరిన్ని కష్టాలు!

ABN, Publish Date - Jan 14 , 2024 | 07:41 PM

కెనడా దేశానికి వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యపై పరిమితిని విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కెనడా దేశానికి వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఆ దేశానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యపై పరిమితిని విధించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ CTV నివేదికలో వెల్లడించారు. అయితే కెనడా వ్యాప్తంగా హౌసింగ్ స్థోమత సంక్షోభం మొదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో మొదటి, రెండవ త్రైమాసికాల్లో అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితిని విధించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణాలు మందగించి గృహాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. మరోవైపు అంతర్జాతీయ విద్యార్థుల పెరుగుదల కారణంగా కూడా గృహ సంక్షోభం పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కెనడాలో 2022లో 800,000 కంటే ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రస్తుతం వీసాలతో ఉన్నారు. ఇది 2012లో 275,000గా ఉండేది.


భారతీయ విద్యార్థుల సంగతేంటి?

కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం కెనడాలోని 8 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రభుత్వం అక్కడికి వెళ్లే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. ఆ విషయంలో భారత్‌కి మాల్దీవులు డెడ్‌లైన్

Updated Date - Jan 14 , 2024 | 07:41 PM

Advertising
Advertising