Earthquake: 4.9 తీవ్రతతో భూకంపం.. నలుగురు మృతి, 120 మందికి గాయాలు
ABN, Publish Date - Jun 19 , 2024 | 07:51 AM
ఇరాన్(Iran)లోని ఈశాన్య నగరమైన కష్మార్‌లో మంగళవారం సంభవించిన భూకంపంలో(earthquake) నలుగురు మృత్యువాత చెందగా, 120 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కష్మార్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లో సంభవించింది.
ఇరాన్(Iran)లోని ఈశాన్య నగరమైన కష్మార్‌లో మంగళవారం సంభవించిన భూకంపంలో(earthquake) నలుగురు మృత్యువాత చెందగా, 120 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కష్మార్‌లోని రజావి ఖొరాసన్ ప్రావిన్స్‌లో సంభవించింది. ఈ వివరాలను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరియత్‌మదారి ప్రకటించారు. మధ్యాహ్నం 1:24 గంటలకు భూకంపం సంభవించిందని.. తీవ్రత రియాక్టర్ స్కేలుపై 4.9గా అంచనా వేయబడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 35 మందిని ఆసుపత్రుల్లో చేర్చినట్లు షరియత్‌మదారి తెలిపారు.
భూకంపం ధాటికి అనేక చోట్ల భవనాలు దెబ్బతిన్నాయని,(building collapse) రోడ్లు ధ్వంసమయ్యాయని షరియత్‌మదారి అన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 6000 మందిని ఇతర ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రెస్క్యూ కార్మికులు శిధిలాలను తొలగించి, రోడ్లపై చెత్తాచెదారంను తొలగిస్తున్నారని స్పష్టం చేశారు. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అంచనా వేసింది.
ఇరాన్ వివిధ టెక్టోనిక్ ప్లేట్లలో ఉండగా, ఇక్కడ తరచుగా భూకంప ప్రకంపనలు(earthquake) సంభవిస్తాయి. గత ఏడాది ప్రారంభంలో కూడా టర్కీ సరిహద్దుకు సమీపంలో ఇరాన్ వాయువ్య పర్వత ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించి, ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే సమయంలో 800 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపం 2003లో ఇరాన్‌లోనే సంభవించింది. ఆగ్నేయ ఇరాన్‌లోని బామ్‌లో 6.6 తీవ్రతతో సంభవించగా, భూకంపం ధాటికి 31,000 మందికి పైగా మరణించారు.
ఇది కూడా చదవండి:
Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్ పేల్చివేస్తామని..
Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest International News and Telugu News
Updated Date - Jun 19 , 2024 | 07:55 AM