ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Iran-Israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తత.. ఇరాన్‌పై ఆంక్షలు విధించాలని UNOకు ఇజ్రాయెల్

ABN, Publish Date - Apr 15 , 2024 | 07:55 AM

ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌(Israel)పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడి(attack) చేసింది. ఆ తర్వాత అమెరికా సహా అగ్రదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి. శనివారం అర్థరాత్రి ఇరాన్ దాడి చేసి వందల కొద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్‌పై "అన్ని విధాలుగా ఆంక్షలు" విధించాలని ఇజ్రాయెల్ UN ప్రతినిధి ఆదివారం భద్రతా మండలిని కోరారు.

Iran Israel Conflict UN Israel

ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్‌(Israel)పై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడి(attack) చేసింది. ఆ తర్వాత అమెరికా సహా అగ్రదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి. శనివారం అర్థరాత్రి ఇరాన్ దాడి చేసి వందల కొద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం తెలిపింది. 300కు పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించగా, 99 శాతం గాలిలోనే ధ్వంసమయ్యాయని సైనిక ప్రతినిధి తెలిపారు.

ఈ చర్యల ద్వారా ఇరాన్(Iran) ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచే దిశగా అడుగులు వేస్తోందని, అనియంత్రిత ప్రాంతీయ ఉద్రిక్తతను రేకెత్తించే ప్రమాదముందని G7 దేశాల నాయకులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనిని నివారించాలన్నారు. పరిస్థితిని స్థిరీకరించడానికి, ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి మేము కలిసి పనిచేస్తామని అన్నారు. జీ7 గ్రూపులో అమెరికా, ఇటలీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి దేశాలు ఉన్నాయి. ఈ సమూహం ఇజ్రాయెల్, దాని ప్రజలకు పూర్తి మద్దతును ప్రకటించింది.


ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్‌పై "అన్ని విధాలుగా ఆంక్షలు" విధించాలని ఇజ్రాయెల్ UN ప్రతినిధి ఆదివారం భద్రతా మండలిని కోరారు. కౌన్సిల్ చర్య తీసుకోవాలని, ఇరాన్‌ భీభత్సాన్ని ఖండించాలని రాయబారి గిలాడ్ ఎర్డాన్ UNOకు చెప్పారు. ఇది తీవ్రతరం కాకముందే ఇరాన్‌పై సాధ్యమయ్యే అన్ని ఆంక్షలు విధించాలని తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇజ్రాయెల్‌పై దాడిలో "ఆత్మ రక్షణకు స్వాభావిక హక్కు"ని ఉపయోగిస్తోందని ఇరాన్ ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఆదివారం భద్రతా మండలిలో చెప్పారు. ఈ నెల ప్రారంభంలో డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడుకోవడంలో భద్రతా మండలి విఫలమైందని అమీర్ సయీద్ ఇరావానీ అన్నారు.


ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్(Antonio Guterres) ట్వీట్ చేస్తూ "మధ్యప్రాచ్యం యుద్ధం అంచున ఉంది. మధ్యప్రాచ్య ప్రజలు విధ్వంసకర ఘర్షణల నేపథ్యంలో నిజమైన ముప్పును ఎదుర్కొంటున్నారు. సంయమనం పాటించడానికి వెనక్కి తగ్గే నిర్ణయం తీసుకోవాలని కోరారు.


ఇది కూడా చదవండి:

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై నేడు 'సుప్రీంలో' విచారణ.. ఉపశమనం లభిస్తుందా?


IPL 2024: ముంబై ఇండియన్స్ నాలుగో ఓటమి.. కానీ రోహిత్ శర్మ పేరిట సరికొత్త రికార్డులు


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 08:02 AM

Advertising
Advertising