నాసా చీఫ్‌గా వ్యాపారవేత్త ఐజాక్‌మ్యాన్
ABN, Publish Date - Dec 06 , 2024 | 05:15 AM
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారం చేపట్టే లోపు కీలక పోస్టులను భర్తీ చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు తదుపరి చీఫ్‌గా ప్రైవేట్ వ్యోమగామి, వ్యాపారవేత్త
ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, డిసెంబరు 5: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారం చేపట్టే లోపు కీలక పోస్టులను భర్తీ చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు తదుపరి చీఫ్‌గా ప్రైవేట్ వ్యోమగామి, వ్యాపారవేత్త జారెడ్ ఐజాక్‌మ్యాన్‌ను ప్రకటించారు. ఈ నియామకం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్‌తో ఐజాక్‌మ్యాన్‌కు వ్యాపార సంబంధాలు ఉండటమే విమర్శలకు కారణం. మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్‌కు ఐజాక్‌మ్యాన్ పెద్ద మద్దతుదారుడే కాకుండా అందులో పెట్టుబడి కూడా పెట్టారు. అయితే 41 ఏళ్ల ఐజాక్‌మ్యాన్ ప్రైవేట్ వ్యోమగామిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
Updated Date - Dec 06 , 2024 | 05:15 AM