Israel Air Strikes: వైమానిక దాడిలో 35 మంది మృతి.. వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువ
ABN, Publish Date - May 27 , 2024 | 07:10 AM
ఇజ్రాయెల్, హమాస్ వార్(israel hamas war) ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి (మే 26న) గాజాలో జరిగిన వైమానిక దాడుల్లో 35 మంది మరణించారు. ఇజ్రాయెల్(Israel) దాడి చేసిందని పాలస్తీనా(Palestinian) ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ఇజ్రాయెల్, హమాస్ వార్(israel hamas war) ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి (మే 26న) గాజాలో జరిగిన వైమానిక దాడుల్లో 35 మంది మరణించారు. ఇజ్రాయెల్(Israel) దాడి చేసిందని పాలస్తీనా(Palestinian) ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 35 మంది మృత్యువాత చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దాడి తరువాత పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని అధికారులు ప్రకటించారు. పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ నిర్వాసితుల శిబిరంపై దాడి జరిగిందని అధికారులు చెప్పారు.
ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు ఈ ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా ప్రకటించాయని గాజా ప్రభుత్వం తెలిపింది. కానీ నిర్వాసితులను అక్కడ ఉంచినప్పుడు వారిపై దాడి జరగడం దారుణమని అన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దాడిని ధృవీకరించింది. అందులో ముఖ్యమైన హమాస్(hamas) ఉగ్రవాదులు కొంతకాలంగా పనిచేస్తున్నారని అంటున్నారు.
దీనికి ముందు హమాస్(hamas) ఆదివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. హమాస్‌కు చెందిన సాయుధ విభాగం అల్-ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం టెల్ అవీవ్(Tel Aviv)పై క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. హమాస్ సాయుధ విభాగం అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో పౌరులపై జియోనిస్ట్ మారణకాండకు ప్రతిస్పందనగా రాకెట్లను ప్రయోగించాయని పేర్కొంది. దీంతో గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు పేల్చినట్లు హమాస్ అల్-అక్సా టీవీ తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే ఘటనకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
Landslides: విరిగిపడిన కొండచరియలు.. 670 మందికి పైగా మృతి
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
Read Latest International News and Telugu News
Updated Date - May 27 , 2024 | 07:18 AM