Protest: ప్రధాని రాజీనామా చేయాలని వీధుల్లోకి వచ్చి ఆందోళన..పలువురికి గాయాలు
ABN, Publish Date - Apr 07 , 2024 | 08:16 AM
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. టెల్ అవీవ్‌లో నిరసనకారులు(protesters) "మేము భయపడము, మీరు దేశాన్ని నాశనం చేశారు, మేము దానిని సరిచేస్తాము" అని నినాదాలు చేశారు. మేము బందీలను సజీవంగా తిరిగి తీసుకొస్తామని, శవపేటికలలో కాదని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హమాస్(hamas) చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని నిరసనకారులు కోరారు.
ఈ క్రమంలో ఓ వైపు ఇజ్రాయెల్ హమాస్(Israel Hamas War) సహా ఉగ్రవాదులతో పోరాడుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఎక్కువయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది బందీలను తిరిగి తీసుకురావడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో బందీల కుటుంబాలు వారిని వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైఫాలో నిరసనకారులు నెతన్యాహు విఫలమయ్యారని, ప్రభుత్వాన్ని దోషి అని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని వేలాది మంది శనివారం రోడ్లపైకి వచ్చి ఆందోళన(protest) నిర్వహించారు.
అయితే ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు(police) ప్రయత్నించగా, పలువురికి గాయాలయ్యాయి. గాజా(gaza)లో ఇప్పటికీ హమాస్ చేతిలో ఉన్న దాదాపు వంద మంది బందీల కుటుంబాలతో మితవాద ప్రభుత్వ వ్యతిరేకులు ఏకం కావడంతో ప్రస్తుత ప్రధానిపై ఒత్తిడి పెరుగుతోంది. హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించి, దాదాపు 250 మందిని బంధించింది.
ఇది కూడా చదవండి:
IPL 2024: రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమికి కారణాలివే..ఇలా చేయకుంటే
India-Maldives Row: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవులు.. ఎందుకో తెలుసా?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 07 , 2024 | 08:21 AM