ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సిరియాపై.. ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులు

ABN, Publish Date - Dec 11 , 2024 | 05:59 AM

కల్లోలిత సిరియాలో తిరుగుబాటుదారులు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ.. ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులు జరుపుతోంది. గడిచిన 13 ఏళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ.. దేశ పునర్నిర్మాణానికి సిరియా నేతలు పిలుపునిస్తుంటే.. ఇజ్రాయెల్‌ విధ్వంసానికి పాల్పడుతోంది. సిరియా అధ్యక్షుడు అసద్‌ ఆదివారం డమాస్కస్‌ నుంచి పలాయనం

కీలక వైమానిక స్థావరాల ధ్వంసం.. ఆయుధాగారాలపైనా ఏరియల్‌ బాంబింగ్‌

బఫర్‌జోన్‌లో భారీగా ట్యాంకులు.. డమాస్క్‌సకు 25 కి.మీ. దూరంలో ఐడీఎఫ్‌

ఖతార్‌, తుర్కియే, ఇరాన్‌ ఖండన.. సిరియాలో కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కారు

మూణ్నెల్లపాటు అల్‌-బషీర్‌ సేవలు.. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం

డమాస్క్‌స/జెరూసలేం, డిసెంబరు 10: కల్లోలిత సిరియాలో తిరుగుబాటుదారులు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ.. ఇజ్రాయెల్‌ ముప్పేట దాడులు జరుపుతోంది. గడిచిన 13 ఏళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ.. దేశ పునర్నిర్మాణానికి సిరియా నేతలు పిలుపునిస్తుంటే.. ఇజ్రాయెల్‌ విధ్వంసానికి పాల్పడుతోంది. సిరియా అధ్యక్షుడు అసద్‌ ఆదివారం డమాస్కస్‌ నుంచి పలాయనం చిత్తగించగానే.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) దాడులను మొదలు పెట్టింది. ఈ మూడ్రోజుల్లో కామిష్లీ, షిన్షార్‌ వైమానికదళ స్థావరాలతోపాటు.. అక్బరా ఎయిర్‌పోర్టుపై వైమానిక దాడులు జరిపింది. ఆదివారం 300కుపైగా.. సోమవారం 100కు పైగా జరిపిన దాడుల్లో ఎయిర్‌బే్‌సలలోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి. కీలకమైన మిలటరీ బేస్‌లు, ఆయుధాగారాలు, రాడార్‌ సెంటర్లు, క్షిపణి క్షేత్రాలను రసాయన ఆయుధాగారాల పేరుతో ధ్వంసం చేసింది. మంగళవారం కూడా డమాస్క్‌సతోపాటు.. శివార్లలోని కునిత్రా, హోమ్స్‌, హమా, లటాకియా, ఖమిష్లీల్లోనూ ఇజ్రాయెల్‌ బాంబింగ్‌ కొనసాగింది. ఈ దాడుల్లో హమాలోని మస్యాల్‌లో ఉన్న శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు, జమ్రాయా, బర్జేహ్‌ ప్రాంతల్లో ఆవాస ప్రాంతాలు ధ్వంసమైనట్లు సిరియా భద్రత బలగాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌ ఆదివారం సాయంత్రమే.. గోలాన్‌హైట్స్‌లోని బఫర్‌జోన్‌లోకి చొచ్చుకువెళ్లింది. 400 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న బఫర్‌జోన్‌లో భారీ ఎత్తున యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఇజ్రాయెల్‌ సేనలు డమాస్క్‌సకు 25 కిలోమీటర్ల దూరంలోని ఖతానా పట్టణం వరకు చొచ్చుకుని వెళ్లాయని అల్‌-జజీరా ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఖతానా నగరం బఫర్‌జోన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వివరించింది. రాయిటర్స్‌ కూడా సిరియా భద్రతాదళాలను ఉటంకిస్తూ.. ఇదే విషయాన్ని ప్రచురించింది. కల్లోల సిరియాపై ఇజ్రాయెల్‌ బాంబింగ్‌ను ఈజిప్టు, సౌదీ అరేబియా, ఖతార్‌, తుర్కియే, ఇరాన్‌ తీవ్రంగా ఖండించాయి. 1974 నాటి ఒప్పందానికి ఇజ్రాయెల్‌ తూట్లు పొడిచిందంటూ మండిపడ్డాయి. అయితే.. ఇజ్రాయెల్‌ మాత్రం తమ సేనలు బఫర్‌జోన్‌ను దాటలేదని స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్‌ చర్యలపై ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో సిరియా ప్రతినిధి భద్రతామండలికి ఫిర్యాదు చేయగా.. తాము సిరియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని ఇజ్రాయెల్‌ ప్రతినిధి డానీ డానన్‌ వివరణ ఇచ్చారు. తమ దేశ భద్రతపైనే ఐడీఎఫ్‌ దృష్టిసారించిందని పేర్కొన్నారు. మరోవైపు సిరియాలో అమెరికా దాడులపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. దీనిపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వివరణ ఇస్తూ.. సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) శిబిరాలపైనే దాడులు జరిపినట్లు స్పష్టం చేశారు.

కొలువుదీరిన ఆపద్ధర్మ సర్కారు

తిరుగుబాటు దళాలకు నేతృత్వం వహించిన హయత్‌ తహ్రీర్‌ అల్‌-షామ్‌(హెచ్‌టీఎ్‌స) ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సాల్వేషన్‌ ప్రభుత్వ అధినేతగా సేవలందించిన మహమ్మద్‌ అల్‌-బషీర్‌ నేతృత్వంలో మంగళవారం సిరియా ఆపద్ధర్మ సర్కారు కొలువుదీరింది. ఈ ప్రభుత్వం మూణ్నెల్లపాటు కొనసాగుతుంది. ఆలోగా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తిస్థాయి సర్కారు ఏర్పాటు దిశగా అల్‌-బషీర్‌, ఆయన క్యాబినెట్‌ మంత్రులు(సాల్వేషన్‌ ప్రభుత్వంలోని సలహాదారులు) కృషిచేస్తారు. ఈలోగా పారామిలటరీని రద్దుచేసి, భద్రత బలగాల్లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఆపద్ధర్మ సర్కారుకు ప్రస్తుత ప్రధాని జలాలీ సహకరిస్తున్నారు. కాగా.. సిరియాలోని జైళ్లలో తమవారి కోసం పౌరులు గాలింపు చేపడుతున్నారు. నిజానికి 2011లో సిరియా జనాభా 2.1 కోట్లు కాగా.. అసద్‌ సర్కారు క్రూరత్వానికి 5 లక్షల మందికి పైగా బలయ్యారు. మరో 10 లక్షల మంది దివ్యాంగులుగా మారారు. 1.3 కోట్ల మంది విదేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. వారంతా తిరిగి రావాలని ఆపద్ధర్మ ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Updated Date - Dec 11 , 2024 | 05:59 AM