ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Israel Iran Tensions: ఇరాన్ దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని రియాక్ట్.. ఏమన్నారంటే.

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:43 PM

ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్(Israel) భూభాగంపై మొదటి ప్రత్యక్ష దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై 100కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు.

Israel Prime Minister Benjamin Netanyahu

ఇరాన్(Iran) శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్(Israel) భూభాగంపై మొదటి ప్రత్యక్ష దాడిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై 100కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) తీవ్రంగా స్పందించారు. తప్పకుండా బదులు తీర్చుకుంటామని చెప్పారు. మా రక్షణ వ్యవస్థలు మోహరించబడ్డాయని తెలిపారు. రక్షణాత్మకంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నెతన్యాహు ఇజ్రాయెల్ పీఎంఓ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రజలు బలంగా ఉన్నారని వెల్లడించారు.


ఎలాంటి ముప్పు వచ్చినా తమను తాము రక్షించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్(Israel) పౌరులు ఒకే ఆలోచనతో ఉన్నారని పేర్కొన్నారు. మనమంతా కలిసికట్టుగా ఉండాలని, దేవుడి సహాయంతో శత్రువులందరినీ జయిస్తామని నెతన్యాహు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ భద్రతా మండలి అధ్యక్షుడికి అత్యవసర లేఖ పంపినట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్‌పై సాధ్యమైన అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.


కాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ కూడా ఓ ప్రకటన చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇరాన్ ఉగ్రవాద దేశమని ఇప్పుడు ప్రపంచం చూస్తోందన్నారు. IDF హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చిన సూచనలను పాటించాలని తాము ఇజ్రాయెల్ పౌరులను కోరుతున్నానని రక్షణ మంత్రి చెప్పారు.

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోషల్ మీడియా(social media) వేదిక ట్వీట్ చేస్తూ స్పందించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్ద ఎత్తున దాడి చేయడం వల్ల ఏర్పడిన తీవ్రతను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను." ఈ శత్రుత్వాలను వెంటనే ముగించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రాంతం లేదా ప్రపంచం మరొక యుద్ధాన్ని భరించలేవని పేర్కొన్నారు.

శనివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్(iran) జరిపిన వైమానిక దాడి బాధ్యతారాహిత్యమని, దీనిని ఏ విధంగానూ సమర్థించలేమని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ట్వీట్ చేశారు. మేము ఇజ్రాయెల్‌కు అనుకూలంగా నిలబడతామన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు నిలిచాయి.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు మధ్యాహ్నం KKR vs LSG మ్యాచ్..ఎవరు గెలుస్తారంటే


Ambedkar Jayanti: నేడు అంబేద్కర్ జయంతి..ఏం చదువుకున్నారు, వేటి కోసం పోరాడారు


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 12:45 PM

Advertising
Advertising