ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Israel Ceasefire Agreement: లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ సిద్ధం.. కానీ మళ్లీ దాడి..

ABN, Publish Date - Nov 27 , 2024 | 08:04 AM

ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రాంతాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఇవి అమలు కాకముందే ఇజ్రాయెల్ బీరూట్‌పై బలమైన దాడిని ప్రారంభించింది. ఈ ఘటనలో 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చుద్దాం.

Israel ceasefire agreement

ఇజ్రాయెల్(Israel), హిజ్బుల్లా కాల్పుల విరమణ విషయంలో గుడ్ న్యూస్ వచ్చింది. ఈ రెండు దేశాలు కూడా విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన ఇజ్రాయెల్ మంత్రిత్వ వ్యవస్థ క్యాబినెట్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ ఒప్పందం నవంబర్ 27 అర్ధరాత్రి (ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం) అమలులోకి వస్తుంది.

అయితే లెబనాన్‌(lebanon)లో ఏం జరుగుతుందనే దానిపై కాల్పుల విరమణ వ్యవధి ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో మేము ఈ ఒప్పందాన్ని అమలు చేస్తామని, ఐక్యంగా ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఈ ఒప్పందం తరువాత ఈ ప్రాంతంలో నివసించే సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని, నిరంతర దాడులు ఆగిపోతాయని నమ్ముతున్నట్లు వెల్లడించారు.


మళ్లీ దాడులు

ఈ క్రమంలో మేము హమాస్‌ను నాశనం చేసే పనిని పూర్తి చేస్తామని, మా బందీలందరినీ ఇంటికి తీసుకువస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. గాజా ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించకుండా చూస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే లెబనీస్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ దాడిని ప్రారంభించింది. ఈ దాడిలో దాదాపు 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇజ్రాయెల్ హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి సమ్మతిస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ఈ దాడి జరిగింది.


కారణమిదేనా..

హిజ్బుల్లా రాజధాని బీరుట్‌పై (Beirut) ఇజ్రాయెల్ దాడి అత్యంత దిగ్భ్రాంతికరమైనది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి హిజ్బుల్లాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. అయితే ఇజ్రాయెల్ దాడి కాల్పుల విరమణ అమలుకు ముందు హిజ్బుల్లాపై దాడిని కొనసాగించాలనుకుంటున్నట్లు నెతన్యాహు ఉద్దేశం స్పష్టమవుతుందని పలువురు అంటున్నారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఫ్రాన్స్, అమెరికా మధ్యవర్తిత్వం నేపథ్యంలో జరిగింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం విశేషం.


14 నెలల పోరాటం

ఇజ్రాయెల్ గత 14 నెలలుగా హమాస్, దాని సహాయక గ్రూపులతో యుద్ధం చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో ఘోరమైన దాడి జరిగింది. ఆ తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత మొదలైంది. ఈ వివాదం తరువాత అనేక ప్రాంతాలలో యుద్ధం ప్రారంభమైంది. దీనిలో ఇజ్రాయెల్, లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా వర్గం కూడా ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో 3,750 మందికి పైగా మరణించారు. 10 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఒక సంవత్సరానికి పైగా జరుగుతున్న రక్తపాత యుద్ధం మధ్య US కాల్పుల విరమణ ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించిందని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..


Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 27 , 2024 | 12:10 PM