Israel : హెజ్‌బొల్లా దాడిలో చనిపోయిన చిన్నారులకు కన్నీటి వీడ్కోలు
ABN, Publish Date - Jul 29 , 2024 | 04:24 AM
ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో సాకర్ ఆడుతూ శనివారం హెజ్‌బొల్లా రాకెట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
దాడికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిక
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలు ధ్వంసం
టెల్‌అవీవ్, జూలై 28: ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో సాకర్ ఆడుతూ శనివారం హెజ్‌బొల్లా రాకెట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల, యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులను ప్రజలు నిలదీశారు. 9 నెలలుగా హెజ్‌బొల్లా దాడులు జరుగుతున్నా తమను పట్టించుకోలేదని, ఏ మొహం పెట్టుకుని ఇక్కడకు వచ్చారని ప్రశ్నించారు.
కాగా, లెబనాన్‌వైపు నుంచి హెజ్‌బొల్లా ప్రయోగించిన రాకెట్లు గోలన్ హైట్స్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్‌పై పడడంతో అక్కడ ఆడుతున్న ఐదుగురు చిన్నారులు, ఏడుగురు యువత ప్రాణాలు కోల్పోగా.. మరో 20మంది గాయపడ్డారు.
ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడి గురిం చి తెలుసుకుని అర్థంతరంగా తన పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఈ దాడితో తమకు సంబంధం లేదని హెజ్‌బొల్లా చెబుతుండగా, పిల్లల ప్రాణాలకు ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇక యుద్ధంలోకి దిగుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. ఆదివారం తూర్పు లెబనాన్‌లోని బక్కా వ్యాలీ, షబ్రిహ, బుర్జ్ అల్- షెమలీ, కఫార్ కిలా సహా పలు ప్రాంతాల్లోని హెజ్‌బొల్లా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది.
Updated Date - Jul 29 , 2024 | 04:24 AM