అవినీతి ఆరోపణలపై విచారణకు నెతన్యాహు హాజరు
ABN, Publish Date - Dec 11 , 2024 | 06:12 AM
అవినీతి కేసులో విచారణ కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ(75) మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఇలాంటి విచారణను ఎదుర్కొన్న తొలి సిట్టింగ్ ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం
టెల్ అవివ్, డిసెంబరు 10: అవినీతి కేసులో విచారణ కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ(75) మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఇలాంటి విచారణను ఎదుర్కొన్న తొలి సిట్టింగ్ ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయనను విచారణ జరిపింది. ఒకపక్క గాజాలో యుద్ధం జరుగుతుండగా, మరోవైపు కోర్టులోని బోనులో నాలుగు గంటల పాటు నిల్చొని సమాధానాలు ఇచ్చారు. మధ్యలో రెండుసార్లు మిలటరీ సెక్రటరీ వచ్చి మెసేజ్‌లు అందజేయడంతో విరామం తీసుకొని వార్ రూమ్‌కు వెళ్లి తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రధానిగా విధులు నిర్వర్తించేందుకు విచారణ సమయంలో విరామం ఇవ్వడం కూడా ఇదే ప్రథమం. తనపై వచ్చిన ఆరోపణలకు మీడియానే కారమణమని అన్నారు.
Updated Date - Dec 11 , 2024 | 06:12 AM