Bangladesh : ఆర్మీ చీఫ్ అయిన నెలన్నరకే..
ABN, Publish Date - Aug 06 , 2024 | 04:43 AM
షేక్ హసీనా రాజీనామాతో పాటు.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాపైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఉంది.
Bangladesh : షేక్ హసీనా రాజీనామాతో పాటు.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాపైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఉంది. ఆయన ఆ పదవి చేపట్టింది ఈ ఏడాది జూన్ 23నే! అంటే ఇంచుమించుగా నెలన్నర క్రితం.
ఆయన వయసు 58 సంవత్సరాలు. 1966లో ఢాకాలో జన్మించిన జమాన్.. బంగ్లాదేశ్ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి డిఫెన్స్ స్టడీ్‌సలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం కింగ్స్ కాలేజ్ (లండన్)లో డిఫెన్స్ స్టడీ్‌సలో మరో ఎమ్మే చేశారు. 1985 డిసెంబరులో ఆర్మీలో చేరి సేవలందిస్తున్నారు.
ఆర్మీ చీఫ్ కాకమునుపు.. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా ఆర్నెల్లపాటు వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితి పీస్‌కీపర్‌గా రెండు పర్యటనలు చేశారు. 1997-2000 సంవత్సరాల నడుమ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ ముహమ్మద్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కుమార్తె కమలికను వివాహం చేసుకున్నారు. బంగ్లాదేశ్ సైన్యాన్ని ఆధునీకరించారన్న పేరు జమాన్‌కు ఉంది.
Updated Date - Aug 06 , 2024 | 04:43 AM