ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌గా జై భట్టాచార్య!

ABN, Publish Date - Nov 25 , 2024 | 03:11 AM

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ... నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ పదవి భారతీయ మూలాలున్న జై భట్టాచార్యకు దక్కడం దాదాపుగా ఖాయమైంది.

వాషింగ్టన్‌, నవంబరు 24: అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ... నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) డైరెక్టర్‌ పదవి భారతీయ మూలాలున్న జై భట్టాచార్యకు దక్కడం దాదాపుగా ఖాయమైంది. బయో మెడికల్‌ విభాగంలో అమెరికా చేసే పరిశోధనలన్నీ 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఎన్‌ఐహెచ్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌ పదవి విషయంలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా దేశ అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం భట్టాచర్యకు మొగ్గు చూపుతున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 1968లో కోల్‌కతాలో జన్మించిన జై భట్టాచార్య.. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎండీ, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, నేషనల్‌ బ్యూరో ఎకనమిక్‌ రీసెర్చ్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పని చేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 03:11 AM