Japan Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లో అరుదైన ఘటన.. పాము చేసిన రచ్చ కారణంగా..
ABN, Publish Date - Apr 18 , 2024 | 07:17 AM
జపాన్‌లోని హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. ఒక ట్రైన్ 17 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. నిజానికి.. జపాన్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ దాని సమర్థత, ఖచ్ఛితత్వానికి ప్రసిద్ధి చెందింది.
జపాన్‌లోని (Japan) హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ (Bullet Train) వ్యవస్థలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. ఒక ట్రైన్ 17 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. నిజానికి.. జపాన్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థ దాని సమర్థత, ఖచ్ఛితత్వానికి ప్రసిద్ధి చెందింది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా, షెడ్యూల్ ప్రకారం సమయానికి చేరుకునేలా రైళ్లు నడుస్తుంటాయి. అలాంటిది.. ఓ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యంగా నడవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అది ఆలస్యం అవ్వడానికి కారణం.. మానవ తప్పిదమో లేక సాంకేతిక లోపమో కాదు.. ఒక పాము.
లింగ మార్పిడి వయస్సు మరింత తగ్గింపు..కీలక చట్టానికి ఆమోదం
సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రకారం.. టోక్యోకు చెందిన ఓ ప్రయాణికుడు నగోయా నుంచి రాగానేకు బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించాడు. అయితే.. అతని వద్ద 16 అంగుళాల పాముని గుర్తించడంతో, అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం వెంటనే రంగంలోకి దిగి సమస్యని పరిష్కరించారు. ఈ కారణంగానే.. సదరు ట్రైన్ 17 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచినట్లు తేలింది. సాధారణంగా.. అక్కడి రైళ్లలో కొన్ని జంతువుల్ని తీసుకెళ్లడానికి అనుమతిస్తారు కానీ, పాములను మాత్రం అనుమతించరు. అయితే.. ప్రయాణికుల లగేజీని చెక్ చేసే నిబంధన లేదు. ఈ నేపథ్యంలోనే.. సదరు ప్రయాణికుడు ఎవ్వరికీ కనిపించకుండా పాముని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అతడు చేసిన ఈ పనికి.. జపాన్ బుల్లెట్ ట్రైన్ వ్యవస్థలో ఎప్పుడూ లేని 17 నిమిషాల ఆలస్యం చోటు చేసుకుంది.
ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం!
కాగా.. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964లోనే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఆ దేశంలో దీని నెట్‌వర్క్ 2700 కిలోమీటర్లుగా ఉంది. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వకుండా, షెడ్యూల్ ప్రకారం ట్రైన్లను నడిపేలా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడో ఒకసారి.. ఒక నిమిషం పాటు ఆలస్యం అవ్వొచ్చేమో గానీ, అంతకంటే ఎక్కువ సమయం పట్టదు. ఆ నిమిషం ఆలస్యానికి గాను.. ప్రయాణికులకు రైల్వే సంస్థ క్షమాపణలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 18 , 2024 | 07:17 AM