ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nobel prizes 2024: 'నిహాన్ హిడాంకియో' సంస్థకు నోబెల్ పురస్కారం..

ABN, Publish Date - Oct 11 , 2024 | 03:52 PM

హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయట పడిన వారికి సేవలందిస్తున్న జపాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిహాన్ హిడాంకియోకు నోబెల్ బహుమతి వరించింది.

టోక్యో: హిరోషిమా, నాగసాకి పై అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయట పడిన వారికి సేవలందిస్తున్న జపాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నిహాన్ హిడాంకియోకు నోబెల్ బహుమతి వరించింది. స్వచ్ఛంద సేవలతోపాటు అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం నిహాన్‌ హిడాంకియో కృషి చేస్తోంది. దాని సేవలను గుర్తించి 2024 సంవత్సరానికి నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించారు. ఈమేరకు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. నిహాన్‌ హిడాంకియోను హిబాకుషా అని కూడా పిలుస్తారు. హిరోషిమా, నాగసాకిపై రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ప్రయోగించడంతో ఆ నగరాలు సర్వనాశనం అయ్యాయి. లక్ష 20 వేలమందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణాలతో బయటపడిన వారు అణుబాంబు ప్రభావంతో దీర్ఘకాలంలో నరకం అనుభవించారు. ఇవన్నీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. తాము అనుభవిస్తున్న నరకం ఇంకెవరికీ రాకూడదని అందుకోసం ఇంకెక్కడా అణుదాడి జరగకూడదని బాధితుల వీడియోలతో నిహాన్‌ హిడాంకియో ప్రచారం చేస్తోంది. నిహాన్‌ హిడాంకియోను 1956లో స్థాపించారు. 1945లో అణుబాంబు దాడిలో బతికి బయట పడ్డవారికి ఆ సంస్థ సేవలందిస్తోంది. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను నోబెల్ కమిటీ ప్రశంసించింది. వారు పడిన నరకయాతన నుంచే ఈ ఆలోచన పుట్టిందని తెలిపింది.


ప్రజలే సమిధలు..

అయితే.. జపాన్‌పై బాంబు దాడులు జరిగి దాదాపు 80 ఏళ్లు గడిచినా, అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది. గాజాలో 2023 అక్టోబర్‌‌లో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో 42 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.17 నెలలుగా కొనసాగుతోన్న యుద్ధంతో సూడాన్ వణికిపోతోంది. అన్ని ఘటనల్లో అమాయక ప్రజలే సమిధలుగా మారుతున్నారు. లక్షల సంఖ్యలో ఆహారం లేక అల్లాడుతున్నారు. చాలా మంది నిరాశ్రయులవుతున్నారు. యుద్ధాలను ఆపి శాంతి స్థాపనకు కృషి చేయాలని నోబెల్ కమిటీ పిలుపునిచ్చింది.

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 03:52 PM