Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి జో బైడెన్ పేరు ఖరారు
ABN, Publish Date - Mar 13 , 2024 | 08:00 AM
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (Joe Biden) ఈ ఏడాది చివరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఆయన నామినేట్ అయ్యారని అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడానికి 1,968 మంది ప్రతినిధుల ఓట్లు అవసరమవ్వగా తాజాగా జార్జియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ అర్హత సాధించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (Joe Biden) ఈ ఏడాది చివరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఖరారైంది. ఈ మేరకు బుధవారం ఆయన నామినేట్ అయ్యారని అమెరికా మీడియా పేర్కొంది. అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడానికి 1,968 మంది ప్రతినిధుల ఓట్లు అవసరమవ్వగా తాజాగా జార్జియా రాష్ట్రంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ కీలక విజయం సాధించారని, నామినేషన్‌కు అర్హత సాధించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మిస్సిస్సిపీ, వాషింగ్టన్, నార్తర్న్ మారియానా ఐలాండ్స్‌లలో కూడా బైడెన్‌కు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.
మరోవైపు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌తో తలపడేందుకు రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేరువయ్యారు. గతవారం ‘సూపర్ ట్యూస్‌డే’ 15 రాష్ట్రాలలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ఆయన 14 రాష్ట్రాలలో విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయడం దాదాపు ఖరారైంది. ట్రంప్‌తో భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ పోటీ పడుతున్నారు. హేలీకి దేశవ్యాప్తంగా మంచి పేరు ఉన్నప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కే అధిక మద్దతు ఉంది.
కాగా అమెరికాలో ఒక పార్టీ తరపున పోటీ చేసే ప్రెసిడెంట్ నామినీని ఎంచుకోవడానికి పరోక్ష ఎన్నికలు లేదా ప్రైమరీ ఎన్నికలను పార్టీలో అంతర్గతంగా నిర్వహిస్తారు. ఓటర్లు నిర్ణయించిన ప్రతినిధులు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. తద్వారా పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎవరు పోటీ చేయాలనేదానిని నిర్ణయిస్తారు.
Updated Date - Mar 13 , 2024 | 08:00 AM