ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joe Biden: కళ్లు చెమర్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎందుకంటే?

ABN, Publish Date - Aug 20 , 2024 | 11:04 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు చెమర్చారు. చికాగోలో సోమవారం ప్రారంభమైన ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌’ ఈ దృశ్యానికి వేదికైంది. అధ్యక్ష నామినీని పార్టీ అధికారికంగా ఆమోదించనున్న ఈ సమావేశాల తొలి రోజున అధ్యక్షుడు జో బైడెన్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

Joe Biden

చికాగో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమర్చారు. చికాగోలో సోమవారం ప్రారంభమైన ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌’ ఈ దృశ్యానికి వేదికైంది. అధ్యక్ష నామినీని పార్టీ అధికారికంగా ఆమోదించనున్న ఈ సమావేశాల తొలి రోజున అధ్యక్షుడు జో బైడెన్‌ వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘వీ లవ్ యూ జో’ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాల మధ్య మాట్లాడుతూ బైడెన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపు ఆగాక తేరుకొని తిరిగి ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ‘స్టాండింగ్ ఓవియేషన్’ లభించింది.


‘‘మనం చేయాల్సి చాలా ఉందని మా ఇద్దరికీ తెలుసు. మనం సవ్యమైన దిశగానే పయనిస్తున్నాం’’ అంటూ కమలా హ్యారీస్‌ను ఉద్దేశించి జో బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఒక ‘లూజర్’ అని వ్యాఖ్యానించారు. ‘‘మేము ఓడిపోతామని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. కానీ అతడే లూజర్. ప్రపంచంలోనే అగ్రగామిగా మనమేనని అనుకోని ఏదైనా ఒక దేశం పేరు చెప్పండి. మనం కాకపోతే ఈ ప్రపంచాన్ని ఇంకెవరు నడిపించగలరు?’’ అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇక తన పాలనలో సాధించిన విజయాలను బైడెన్ ప్రస్తావించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్ననాటి పాలనతో పోల్చి విమర్శలు గుప్పించారు. గణాంకాలు అన్నీ చూపించి ట్రంప్ పూర్తిగా తప్పు అని బైడెన్ పేర్కొన్నారు.


కాగా వయసు రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. తన వారసురాలిగా కమలా హ్యారీస్‌కు పగ్గాలు అప్పగించారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఇదే అతిపెద్ద పరిణామంగా అక్కడి రాజకీయ నిపుణులు విశ్లేషించారు. పార్టీ కోసం, దేశం కోసం తదుపరి తరానికి మార్గం చూపించిన జో బైడెన్‌కు డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌‌లో ఘనంగా ఫేర్‌వెల్ ఇచ్చారు.


బైడెన్‌పై కమలా ప్రశంసల జల్లు..

‘‘ మన అద్భుతమైన అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి మాట్లాడడం ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించాలనుకుంటున్నాను. జో.. మీ చారిత్రాత్మక నాయకత్వానికి, దేశానికి జీవితాంతం సేవ అందించిన మీకు ధన్యవాదాలు. మేమంతా మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం’’ అని అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్ ప్రశంసించారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్ చివరి రోజున ప్రసంగం చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజునే మాట్లాడిన కమలా హ్యారీస్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికాకు జీవితాంతం సేవ చేసిన అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్‌కు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Aug 20 , 2024 | 11:18 AM

Advertising
Advertising
<