ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Katchatheevu row: ఎన్నికల్లో గెలుపు కోసం

ABN, Publish Date - Apr 04 , 2024 | 05:59 PM

కచ్చతీవుల వ్యవహారంపై భారత్‌లో శ్రీలంక మాజీ రాయబారి అస్టిన్ ఫెర్నాండో తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కచ్చతీవు అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకు వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత.. ఈ అంశం వెనక్కి పోతుందన్నారు.

శ్రీలంక, ఏప్రిల్04: కచ్చతీవుల వ్యవహారంపై భారత్‌లో శ్రీలంక మాజీ రాయబారి అస్టిన్ ఫెర్నాండో తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కచ్చతీవు అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకు వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత.. ఈ అంశం వెనక్కి పోతుందన్నారు. గురువారం మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అస్టిన్ ఫెర్నాండో మాట్లాడారు. శ్రీలంక ప్రాదేశిక అంతర్జాతీయ సరిహద్దు గీతను భారత్ దాటిందంటే.. శ్రీలంక సార్వభౌమత్వాన్ని అతిక్రమించడమేనని అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్ ఇటువంటి ప్రతిపాదన.. గోవా వద్ద చేసినా? బంగ్లాదేశ్.. బంగాళాఖాతంలో ఇదే తరహా ప్రయత్నం చేసినా.. భారత్ ఎలా స్పందిస్తుందని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒకటని అభివర్ణించారు. ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించిన కొద్ది రోజులకు అస్టిన్ ఫేర్నాండో‌పై విధంగా స్పందించారు.

50 ఏళ్ల క్రితం న్యూఢిల్లీ అప్పగించిన దీనిపై మళ్లీ చర్చలు అనవసరమని స్పష్టం చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు కచ్చతీవు అంశాన్ని ఉపయోగించు కొంటున్నారన్నారు. గత ఎన్నికల్లో 39 లోక్‌సభ స్థానాలు ఉన్న తమిళనాడులో బీజేపీ పాగా వేయలేకపోయిందని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఈ ఎన్నికల్లో ఆ స్థానాలను కైవసం చేసుకొనేందుకు కచ్చతీవు అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారంటూ బీజేపీ, మోదీపై విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి.

Updated Date - Apr 04 , 2024 | 06:18 PM

Advertising
Advertising