Bangladesh Crisis:రంగంలోకి షేక్ హసీనా శత్రువు.. ప్రధాని కాబోతున్నారా..!
ABN, Publish Date - Aug 06 , 2024 | 05:47 PM
ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.
ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ కాబోయే ప్రధాని ఎవరనే చర్చ జరుగుతోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె చిరాకాల రాజకీయ ప్రత్యర్థి.. గత కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఖలీదా జియా రంగంలోకి దిగారు. విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న జియా విడుదలకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె గృహనిర్భందం నుంచి విడుదలయ్యారు. ఖలీదా జియా అవిభాజ్య భారత్‌లోని పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్‌పాయిగుడీలో 1945 ఆగష్టు 15న జన్మించారు. ఆమె భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుర్ రెహమాన్. 1977 నుంచి 1981 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1981లో జియావుర్ రెహమాన్ హత్యకు గురికావడంతో ఖలీదా జియా బేగం రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుంచి ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పి) అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
Bangladesh : ఆర్మీ చీఫ్ అయిన నెలన్నరకే..
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా..
బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా 1991లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఆసమయంలో బంగ్లాలో అస్థిరపరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపించేందుకు పూర్తి స్థాయి మెజార్టీ కోసం ఆమె మిత్రపక్షాల మద్దతు తీసుకున్నారు. 1996లో రెండో దఫా ఎన్నికల్లో ఖలీదా జియా పార్టీ విజయం సాధించారు. అయితే అక్రమాలు చోటుచేసుకున్నాయని అవామీ లీగ్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆ ఎన్నికలను బాయ్‌కాట్ చేశాయి. దాంతో ఆమె ప్రభుత్వం కేవలం 12 రోజులకే కుప్పకూలిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలుపొందడంతో షేక్ హసీనా తొలిసారి.. రెండో మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఐదేళ్లకు మళ్లీ జియా అధికారాన్ని సొంతం చేసుకున్నారు. 2001 నుంచి 2006 వరకు ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అవినీతి కేసులో ఆమె అరెస్టయ్యారు.
Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్
17 ఏళ్ల జైలు శిక్ష..
2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఖలీదా జియాకు పదిహేడేళ్ల జైలుశిక్ష పడింది. ఆ శిక్షతో ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. ప్రస్తుతం 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రిజర్వేషర్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరికి దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడి ఆదేశాలతో ఖలీదా జియా బయటకు వచ్చారు. త్వరలో ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపడతారని ప్రచారం జరుగుతోంది.
Bangladesh : గల్ఫ్‌లో బంగ్లా ప్రవాసీల సంఘీభావం
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More international News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 05:47 PM