మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hezbollah Attack: ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులతో లెబనాన్ దాడి..అక్కడి భారతీయులకు సూచనలు

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:59 AM

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel), హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్‌కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.

Hezbollah Attack: ఇజ్రాయెల్‌పై 40 క్షిపణులతో లెబనాన్ దాడి..అక్కడి భారతీయులకు సూచనలు
Lebanon Hezbollah attack with 40 missiles on Israel

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel), హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్‌కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. అయితే లెబనాన్‌కు ఇరాన్‌ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) శుక్రవారం అర్ధరాత్రి తర్వాత లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు సుమారు 40 రాకెట్లు ప్రయోగించబడ్డాయని వెల్లడించింది.

ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్(iran) రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసింది. ఈ చర్యలో ఇరాన్‌కు చెందిన ఇద్దరు టాప్ జనరల్స్ మరణించారు. ఈ దాడితో ఆగ్రహించిన టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. శుక్రవారం-శనివారం మధ్య రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేయవచ్చని అమెరికన్(america) అధికారులు నివేదికలు కూడా ఇచ్చారు.


మరోవైపు సిరియాలోని తన కాన్సులేట్‌పై దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తత దృష్ట్యా, ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లవద్దని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తమ పౌరులకు సూచనలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ప్రాంతాలకు కార్మికులను పంపాలన్న నిర్ణయాన్ని కూడా వాయిదా వేశారు. దీంతోపాటు ఇరాన్, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు(indians) చాలా జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.


ఇరాన్ నుంచి దాడులు జరగనున్నాయన్న నేపథ్యంలోనే తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా(Hezbollah) ఇజ్రాయెల్‌పై 40కి పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను రక్షణ దళాలు విడుదల చేశాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని గలీలీలో జరిగిన దాడిలో, హిజ్బుల్లా రెండు డ్రోన్‌లను ఇజ్రాయెల్ సైన్యం కూల్చేసింది.


ఇది కూడా చదవండి:

PM Modi: కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు.. ఎందుకంటే..?


సిద్ధాంత పోరులో ‘ఇండియా’దే విజయం


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 07:39 AM

Advertising
Advertising