ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri lanka Election: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసానాయకే ఎన్నిక

ABN, Publish Date - Sep 22 , 2024 | 09:01 PM

శ్రీలంకంలో 2022లో తలెత్తిన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. శనివారంనాడు అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగగా, 76 శాతం ఓటింగ్ నమోదైంది. వెంటనే ఫలితాలు లెక్కించారు. 42.31 శాతం ఓట్లతో మార్క్సిస్ట్ నేత దిసానాయకే గెలుపొందారు.

కొలంబో: శ్రీలంక (Sri Lanka) కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసానాయకే (Anur Kumara Dissanayake) ఎన్నికయ్యారు. 42.31 శాతం ఓట్లను ఆయన సాధించినట్టు ఆదివారంనాడు అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. 55 ఏళ్ల పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (JVP) నేత దిసనాయకే విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ధ్రువీకరించింది.

Blast: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 30 మంది మృతి, పలువురికి గాయాలు


శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. శనివారంనాడు అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగగా, 76 శాతం ఓటింగ్ నమోదైంది. వెంటనే ఫలితాలు లెక్కించారు. 42.31 శాతం ఓట్లతో దిసానాయకే గెలుపొందగా, 32.76 శాతం ఓట్లతో విపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 17.23 శాతం ఓట్లతో మూడు స్థానానికి పరిమితమయ్యారు. ఇరవై ఏళ్లుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న దిసానాయకే వైపే మెజారిటీ ఓటర్లు మొగ్గుచూపినట్టు ఫలితాలు చెబుతున్నాయి. జాతీయ ఐక్యతకు పాటుపడతానని ఎన్నికల్లో గెలుపు అనంతరం దిసానాయకే ప్రకటించారు. కొలంబియాలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో సోమవారంనాడు జరిగే కార్యక్రమంలో ఆయన శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


For More International News And Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 09:01 PM