ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

ABN, Publish Date - Apr 18 , 2024 | 01:09 PM

నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి.

నిత్యం ఎండలతో అల్లాడిపోయే దుబాయ్ ( Dubai ) లో వరదలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్ మాల్స్‌తో సహా చాలా ప్రదేశాలు నీట మునిగాయి. దుబాయ్‌లో ఇంత వర్షం కురవడానికి క్లౌడ్ సీడింగ్‌ కారణమనే వార్తలు వెల్లువెత్తాయి. వేడెక్కుతున్న వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఫ్రెడరిక్ ఒట్టో తెలిపారు. వెచ్చని వాతావరణం ఎక్కువ తేమను కలిగి ఉంటుందన్నారు. అయితే క్లౌడ్ సీడింగ్‌ కారణంగానే దుబాయ్ లో అత్యంత భారీ వర్షం పడిందని తాము అనుకోవడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Trending: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏమిటి.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

క్లౌడ్ సీడింగ్‌తో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది దశాబ్దాల నాటి వ్యవస్థ అయినప్పటికీ ఇది సరిగ్గా పనిచేస్తుందని నిరూపించడం చాలా కష్టం. క్లౌడ్ సీడింగ్ వల్ల ఒక సంవత్సరంలో 4 లేదా 5 అంగుళాల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇంతకుమించి వర్షం కురిసింది. కాబట్టి ఇది క్లౌడ్ సీడింగ్ కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వర్షాన్ని సృష్టించలేమని వెల్లడించారు. దుబాయ్‌లో వర్షం కురుస్తుందని కొన్ని రోజుల ముందే అంచనా వేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి క్లౌడ్ సీడింగ్‌ వల్లే వర్షాలు కురిశాయని అనుకోవడం సరికాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 01:09 PM

Advertising
Advertising