Microsoft Outage: మైక్రోసాఫ్ట్ క్రాష్‌తో లక్షల కోట్ల నష్టం..? ఏయే రంగాలపై ఎంత ప్రభావం
ABN, Publish Date - Jul 20 , 2024 | 09:55 AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్(Microsoft) సిస్టమ్‌లు శుక్రవారం క్రాష్ అయిన విషయం విదితమే. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ తన "ఫాల్కన్ సెన్సార్" సాఫ్ట్‌వేర్ కోసం చేసిన అప్‌డేట్‌లో లోపం కారణంగా సాంకేతిక అంతరాయం ఏర్పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్(Microsoft) సిస్టమ్‌లు శుక్రవారం క్రాష్ అయిన విషయం విదితమే. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ తన "ఫాల్కన్ సెన్సార్" సాఫ్ట్‌వేర్ కోసం చేసిన అప్‌డేట్‌లో లోపం కారణంగా సాంకేతిక అంతరాయం ఏర్పడింది.
దీంతో చాలా డివైజ్‌లలో బ్లూ స్క్రీన్ ప్రదర్శితమైంది. అంతరాయం సమయంలో "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్" అనే వార్నింగ్ కనిపించింది. శుక్రవారం ఉదయమే ఈ సమస్య తలెత్తింది. చరిత్రలోనే ఐటీ పరిశ్రమలో ఇంత పెద్ద అంతరాయం ఏర్పడటం ఇదే తొలిసారి. గ్లోబల్ టెక్ అంతరాయం కారణంగా విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకులు, మీడియా అవుట్‌లెట్‌లు, ఇతర పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ఏయే రంగాలు ఎంతగా ప్రభావితమయ్యాయంటే..
విమానయాన సంస్థలు
మైక్రోసాఫ్ట్ క్రాష్‌తో ప్రధానంగా ప్రభావితమైన లిస్టులో విమానయాన సంస్థలు ప్రథమంగా ఉన్నాయి. అనేక దేశాల్లో చాలా విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానయాన పరిశ్రమ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటోంది. భారత్‌లో స్పైస్‌జెట్, ఇండిగో, అకాస ఎయిర్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు సమస్యలను ఎదుర్కున్నాయి.
సాంకేతిక లోపం కారణంగా స్పైస్‌జెట్, ఇండిగో ఆన్‌లైన్ బుకింగ్ సేవలు దెబ్బతిన్నాయని రాయిటర్స్ నివేదించింది. దీంతో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నైకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విమానాశ్రయ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన దాదాపు 23 విమానాలను రద్దు చేశారు.
విశాఖపట్నం, తిరుపతి, అహ్మదాబాద్, బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానాలు ఆ లిస్టులో ఉన్నాయి. బెర్లిన్, లిస్బన్, ఆమ్‌స్టర్‌డామ్, బ్రస్సెల్స్, బుడాపెస్ట్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాలు కూడా ప్రభావితమయ్యాయి. అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌తో సహా ప్రధాన అమెరికా క్యారియర్‌లు శుక్రవారం ఉదయమే విమానాలను నిలిపేశాయి.
JP మోర్గాన్ చేజ్ అండ్ కో, మాక్వారీ క్యాపిటల్, బ్రాడెస్కో వంటి ఫైనాన్స్ కంపెనీలన్నీ అంతరాయంతో దెబ్బతిన్నాయి.
ఆస్ట్రేలియా అతిపెద్ద బ్యాంక్ కామన్వెల్త్ బ్యాంక్ ఇన్‌స్టంట్ ఫండ్ నగదు బదిలీలో సమస్యలను ఎదుర్కుంటోంది. క్యాపిటెక్ బ్యాంక్, అబ్సా, దక్షిణాఫ్రికా ఫైనాన్స్ దిగ్గజాల సేవలకు అంతరాయం కలిగింది.
జర్మనీలో బీమా సంస్థ అలియన్జ్ ఉద్యోగులు తమ సిస్టమ్‌లకు లాగిన్ చేయలేకపోయారు.
దేశంలోని కొన్ని బ్రోకరేజీలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని వ్యాపారులు చెప్పారు.
డిజిటల్ అంతరాయం కారణంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, భారత్ తదితర దేశాల్లో ఆరోగ్య సేవలు దెబ్బతిన్నాయి. మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
For Latest News and National News click here
Updated Date - Jul 20 , 2024 | 10:06 AM