Iran: ఇరాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరు..?
ABN, Publish Date - May 20 , 2024 | 01:26 PM
ఇరాన్ రాజ్యాంగంలో గల ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు ఆకస్మాత్తుగా చనిపోతే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగ అధిపతితో కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఖమేని ఆమోదం లభిస్తే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. అలా తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. రైసీ మృతిని ఆ దేశ స్థానిక మీడియా ధృవీకరించింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంతలో ఇరాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరనే చర్చ మొదలైంది. రైసీ రాజకీయ వారసత్వాన్ని ఎవరు స్వీకరించనున్నారు..?
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం
ఇరాన్ రాజ్యాంగంలో గల ఆర్టికల్ 131 ప్రకారం అధ్యక్షుడు ఆకస్మాత్తుగా చనిపోతే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగ అధిపతితో కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. కౌన్సిల్ ప్రతిపాదన మేరకు ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఖమేని ఆమోదం లభిస్తే వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారు. అలా తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
పాలన అనుభవం
పాలన అందించడంలో మహ్మద్‌కు అనుభవం ఉంది. ఇదివరకు సెటాడ్ అనే ఫౌండేషన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 1979లో ఇస్లాం విప్లవం తర్వాత జప్తు చేయబడిన ఆస్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిందే సెటాడ్. మహ్మద్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటే ఇరాన్ కీలక నేత ఖమేని ఆమోదం తప్పనిసరి అవుతుంది. మహ్మద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో అతని ఎన్నికకు ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈయూ ఆంక్షలు
రైసి వారసుడిగా మహ్మద్ మొఖ్బర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ అంశాలపై మంచి పట్టు ఉంది. సెటాడ్ ఫౌండేషన్ కోసం చేసిన పనులు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 2010లో మహ్మద్ పేరును యూరోపియన్ యూనియన్ ఆంక్షలు జాబితాలో చేర్చింది. అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపల్లో పాల్గొన్నారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఆంక్షల జాబితా నుంచి మహ్మద్ పేరును యూరోపియన్ యూనియన్ తొలగించింది. అలా మహ్మద్ సెటాడ్‌లో పని చేసి ఒకవిధంగా పేరు సంపాదించారు. 2021లో ఇరాన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. రైసీ ఆకాల మరణంతో అధ్యక్షుడు అయ్యే అవకాశం వచ్చింది.
Read Latest International News and Telugu News
Updated Date - May 20 , 2024 | 01:26 PM