ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pakistan: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు..ప్రధానిగా షెహబాజ్ షరీఫ్!

ABN, Publish Date - Feb 21 , 2024 | 07:25 AM

పాకిస్థాన్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అనేక రోజుల చర్చల తర్వాత ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలో దేశ ప్రధాని, అధ్యక్ష పదవులు కూడా దాదాపు ఖారారయ్యాయి.

పాకిస్థాన్‌(Pakistan)లో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అనేక రోజుల చర్చల తర్వాత ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకున్నాయని పార్టీ నేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ మంగళవారం అర్థరాత్రి సంయుక్త విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) ఛైర్మన్ షెహబాజ్ షరీఫ్(shehbaz sharif) మళ్లీ ప్రధానమంత్రి పాత్రను స్వీకరిస్తారని, పీపీపీ సహ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ(asif ali zardari) అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించారు.


ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ చర్చలు సానుకూలంగా ముగిసినందుకు రెండు పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీపీపీతో తమ పీఎంఎల్-ఎన్‌కి ఇప్పుడు అవసరమైన సంఖ్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత చాలా అనిశ్చితి మధ్య, PPP, PML-N దేశ ప్రయోజనాల దృష్ట్యా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైనట్లు నేతలు ధృవీకరించారు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులు 93 జాతీయ అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. పీఎంఎల్-ఎన్ 75 సీట్లు గెలుచుకోగా, పీపీపీ 54 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్థాన్ (MQM-P) కూడా తన 17 సీట్లతో వారికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ మద్దతుగల అభ్యర్థులు, సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (SIC) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటులో సాధారణ మెజారిటీని సాధించడంలో విఫలమయ్యారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: China: పట్టపగలే చీకటిగా మారిన చైనాలోని రాష్ట్రం.. ఎందుకో తెలుసా?

Updated Date - Feb 21 , 2024 | 07:25 AM

Advertising
Advertising