Bangladesh: ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ప్రొ. యూనస్
ABN, Publish Date - Aug 06 , 2024 | 02:09 PM
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన వరుస ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి పదవికి షేక్ హాసినా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో మధ్యంత ప్రభుత్వం కొలువు తీరనుంది. అలాంటి వేళ విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ మంగళవారం ప్రభుత్వాధికారుల ఎదుట కీలక ప్రతిపాదన చేసింది.
ఢాకా, ఆగస్ట్ 06: బంగ్లాదేశ్‌లో విద్యార్థులు చేపట్టిన వరుస ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి పదవికి షేక్ హాసినా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో మధ్యంత ప్రభుత్వం కొలువు తీరనుంది. అలాంటి వేళ విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ మంగళవారం ప్రభుత్వాధికారుల ఎదుట కీలక ప్రతిపాదన చేసింది. కొలువు తీరే కొత్త ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా నోబెల్ గ్రహీత, బ్యాంకర్ టు ది పూర్ డాక్టర్ ముహమ్మద్ యూనస్‌ను నియమించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు డైలీ స్టార్ వెల్లడించింది.
Also Read: Gold Rates Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. ఎంతంటే?
మధ్యంతర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడిగా ప్రొఫెసర్ యూనస్‌ను నిర్ణయించామని యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’కు చెందిన నహీద్ ఇస్లాం తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ముందు ఉంచగా.. ఆ పదవి చేపట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నహీద్ ఇస్లాం ఓ వీడియో పోస్ట్ చేశారు. పార్లమెంట్ రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఏర్పాటు కానుందని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు. ఈ ప్రభుత్వానికి ప్రొఫెసర్ యూనస్ ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్నారు.
Also Read: Uttar Pradesh: 80 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
రిజర్వేషన్ల సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని బంగ్లాదేశ్‌లోని వివిధ యూనివర్శిటీ విద్యార్థులు పిలుపు నిచ్చారు. దానికి ప్రజలు సైతం మద్దతు తెలిపారు. దీంతో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న అల్లర్లలో వందలాది మంది మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా కర్ప్యూ సైతం విధించారు.
Bangladesh Turmoil: కేంద్రానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ మద్దతు
కానీ పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. అవి ఒక కొలిక్కి రాకపోవడంతో.. ప్రధాని పదవికి షేక్ హసినా రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైయ్యాయి. అవి సైతం హింసాత్మకంగా మారడంతో.. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె పొరుగుతున్న భారత్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లనున్నారని సమాచారం. అంతేకాకుండా.. రాజకీయాల నుంచి ఆమె శాశ్వతంగా తప్పుకోనున్నారని ఆమె కుమారుడు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి.. కొత్తగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. ఈ కొత్త ప్రభుత్వానికి ప్రొ.యూనస్ ప్రధాన సలహాదారునిగా వ్యవహరించనున్నారు. నోబుల్ బహుమతి గ్రహీత ప్రొ. యూనస్‌ను షేక్ హసినా తీవ్ర వేధింపులకు గురి చేయడమే కాకుండా... ఆయనపై పలు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 06 , 2024 | 02:43 PM