Trump Administration: డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ రిజెక్ట్ చేసిన అధికారి.. కారణాలేంటి..
ABN, Publish Date - Dec 04 , 2024 | 01:15 PM
డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA)కి నాయకత్వం వహించడానికి ఇటివల ట్రంప్ ఎంపిక చేసిన అధికారి నో చెప్పాడు. అయితే ఆయన ఎందుకు నో చెప్పాడు, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఇటివల కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA)కి నాయకత్వం వహించడానికి క్రానిస్టర్ పేరును ప్రకటించారు. మెక్సికోతో అమెరికా సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టడంపై ఆయన దృష్టి సారిస్తానని చెప్పారు. కానీ ఈ పదవిని ఆయన తిరస్కరించారు. అయితే ఈ పదవిని ఉపసంహరించుకున్న వారిలో రెండో అభ్యర్థి క్రానిస్టర్ కావడం విశేషం. అంతకుముందు ఫ్లోరిడా మాజీ ప్రతినిధి మాట్ గేట్జ్ అటార్నీ జనరల్ కూడా తన ఎంపికను ఉపసంహరించుకున్నారు.
కారణమిదే..
క్రానిస్టర్ ప్రస్తుతం ఫ్లోరిడాలోని హిల్స్‌బరో కౌంటీకి షరీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నివసించే ప్రజలకు మరింత కృషి చేయాల్సి ఉందని, అందుకే ఈ పదవిని స్వీకరించడం లేదని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ట్రంప్, అమెరికన్ ప్రజల నుంచి వచ్చిన మద్దతుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను హిల్స్‌బరో కౌంటీకి షెరీఫ్‌గా కొనసాగడానికి ఆసక్తితో ఉన్నట్లు వెల్లడించారు.
ట్రంప్ ప్రకటన కోసం
ప్రస్తుతం దీనిపై డొనాల్డ్ ట్రంప్ బృందం నుంచి ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ ఆదివారం DEAకి నాయకత్వం వహించడానికి క్రానిస్టర్ పేరును ప్రకటించారు. DEA న్యాయ శాఖలో భాగంగా ఉంది. US డ్రగ్ చట్టాలను అమలు చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది. ఆయన తప్పుకున్న నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
మహమ్మారి సమయంలో విమర్శలు
క్రానిస్టర్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల పలువురు విమర్శనాత్మకంగా వర్ణించారు. COVID మహమ్మారి కారణంగా 2020లో విధించిన లాక్‌డౌన్‌లను ఉల్లంఘించినందుకు ఫ్లోరిడా పాస్టర్‌ను షెరీఫ్ అరెస్టు చేయడాన్ని ఉదహరించారు. క్రానిస్టర్ మూడు దశాబ్దాలకు పైగా చట్టాల అమలులో పనిచేశారు. కానీ ఆయనకు డీఈఏ పాత్రలో అనుభవం లేదు. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయడానికి అధ్యక్షుడిగా ఎన్నికైన @realDonaldTrump చేత నామినేట్ కావడం జీవితకాల గౌరవగా ఉందని క్రానిస్టర్ X వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More International News and Latest Telugu News
Updated Date - Dec 04 , 2024 | 01:17 PM