ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Violence: ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

ABN, Publish Date - Nov 27 , 2024 | 06:46 PM

కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది.

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులు, ప్రార్థనా స్థలాలపై వరుస దాడులకు నిరసనగా ఉద్యమించిన 'ఇస్కాన్' నేత చిన్మయ్ కృష్ణదాస్ (Chinmoy Krishna Das Prabhu) ప్రభు అరెస్టు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున 'ఇస్కాన్'ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో బుధవారంనాడు ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్‌లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది. దీంతో 'ఇస్కాన్' ఇటీవల కార్యకలాపాలపై బంగ్లా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో, శాంతి భద్రతలకు తీసుకుంటున్న చర్యలేమిటో గురువారంలోగా తమకు నివేదించాలని అటార్నీ జనరల్‌ మహమ్మద్ అసదుజ్దామన్‌ను హైకోర్టు ఆదేశించింది.

Bangladesh: ఇస్కాన్ కృష్ణదాస్ అనుచరులు, పోలీసుల ఘర్షణలో యువ లాయర్ మృతి


కృష్ణదాస్ అరెస్టుతో ఆందోళనలు

ఢాకా విమానాశ్రయంలో నవంబర్ 25న కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంతో హిందువులు తీవ్ర నిరసనలకు దిగారు. హిందువులు, మైనారిటీల హక్కులు, భద్రతపై నిలదీస్తున్న కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద బంగ్లా పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కోర్టు ఆవరణలో నిరసనలు పెల్లుబికాయి. కృష్ణదాస్‌ను తరలిస్తున్న వ్యానును అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ ఘర్షణల్లో 20 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, ప్రార్థనా మందిరాలపై దాడులు కొనసాగుతున్న తరుణంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమపై జరుగుతున్న దాడులపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశ అధికారులను కోరింది. మరోవైపు 'ఇస్కాన్' సైతం కృష్ణదాస్ అరెస్టును తప్పుపడుతూ, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


ఇది మా అంతర్గత వ్యవహారం: బంగ్లా

కాగా, భారత్ స్పందనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. చిన్మయ్ కృష్ణదాస్‌ను నిర్దిష్ట ఆరోపణలపై అరెస్టు చేశామని, కొందరు దీనిని వక్రీకరించి చెప్పడం సరికాదని తెలిపింది. ఇండియా స్పందన వాస్తవాల వక్రీకరణకు అనుగుణంగా ఉందని, ఇది పొరుగుదేశాల మధ్య మైత్రీ, అవగాహన స్ఫూర్తిగా భిన్నమని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

Donald Trump: 10 శాతం సుంకం విధిస్తామని ప్రకటన

ఉక్రెయిన్‌కు..అమెరికా యాంటీ-పర్సనల్‌ మైన్స్‌

రష్యాలో ఏం జరుగుతోంది?

For More International And Telugu News

Updated Date - Nov 27 , 2024 | 06:48 PM