ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

GPS: యూరప్‌లో జీపీఎస్ జామ్..? వందల విమానాలపై ఎఫెక్ట్..!!

ABN, Publish Date - Mar 26 , 2024 | 09:49 PM

యూరప్‌లో కొన్ని విమానాలు దారి తప్పుతున్నాయి. నావినేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేస్తున్నారని పైలట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సమస్య ఏర్పడింది. గత రెండు రోజుల నుంచి ఎక్కువగా ఉంది. వెయ్యికి పైగా విమానాల నావిగేషన్ సమస్య ఎదుర్కొన్నాయి.

ఏబీఎన్ ఇంటర్నెట్: యూరప్‌లో (Europe) కొన్ని విమానాలు దారి తప్పుతున్నాయి. నావినేషన్ వ్యవస్థను ఎవరో ప్రభావితం చేస్తున్నారని పైలట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సమస్య ఏర్పడింది. గత రెండు రోజుల నుంచి ఎక్కువగా ఉంది. వెయ్యికి పైగా విమానాల నావిగేషన్ సమస్య ఎదుర్కొన్నాయి. దీని వెనక రష్యా (Russia) ఉందని అనుమానిస్తున్నారు. విమానాల్లో జీపీఎస్ జావ్ వెనక ఉన్న కారణం ఏంటీ..? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు.

సమస్య ఏంటీ..?

విమానాలకు నావిగేషన్ వ్యవస్థ ఇంపార్టెంట్. నావిగేషన్ సిస్టమ్ ప్రభావితం చేసి, ఫేక్ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనిని సిగ్నల్ స్పూఫింగ్‌గా పిలుస్తారు. ఒరిజినల్ శాటిలైట్ సిగ్నల్స్ అడ్డుకొని, ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్‌ను తప్పుదారి పట్టిస్తాయి. దాంతో ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయం తప్పుగా చూపిస్తాయి. పౌరుల విమానాల లక్ష్యంగా సిగ్నల్ స్పూఫింగ్ జరగడం ఆందోళన కలిగినిస్తోంది.

1600కు పైగా విమానాలు

రెండు రోజుల్లో సిగ్నిల్ స్పూపింగ్ బారిన 1600కు పైగా విమానాలు పడ్డాయని జీపీఎస్ ట్రాకింగ్ సైట్లు పేర్కొన్నాయి. జీపీఎస్ సిగ్నల్ స్పూపింగ్‌కు కారణం రష్యా అయి ఉండొచ్చని యూరప్ దేశాలు సందేహిస్తున్నాయి. బాల్టిక్ సముద్ర తీర ప్రాంతం వద్ద నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ సమస్య ఏర్పడుతుందని గుర్తించారు. పోలాండ్, సౌత్ స్వీడన్‌లో సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంది. ఫిన్లాండ్‌లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. బాల్టిక్ సముద్రం, నాటో దేశాల సమీపంలో వచ్చే పౌర విమానాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ కాదని నిపుణులు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వివరించారు. జీపీఎస్ వ్యవస్థను నిలిపివేసే సామర్థ్యం రష్యాకు ఉందని స్వీడన్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

గత ఏడాది కూడా

గత ఏడాది ఇరాన్-ఇరాక్ గగనతలంలో విమానాలు తరచూ దారి తప్పాయి. నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ వల్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. నావిగేషన్ వ్యవస్థ ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించే శక్తిమంతంగా సంకేతాలు ఉన్నాయని భావించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 09:49 PM

Advertising
Advertising