Delhi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే
ABN, Publish Date - Mar 20 , 2024 | 05:25 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి(Vladimir Putin) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం ఫోన్ కాల్ చేశారు. అధ్యక్ష పదవికి పుతిన్ తిరిగి ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తాజా ఫోన్ కాల్ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి(Vladimir Putin) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం ఫోన్ కాల్ చేశారు. అధ్యక్ష పదవికి పుతిన్ తిరిగి ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తాజా ఫోన్ కాల్ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యా ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సును ఆకాంక్షించారు.
ఇరువురు నాయకులు రానున్న రోజుల్లో భారత్, రష్యాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. వారు రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తన X అకౌంట్లో ఇందుకు సంబంధించిన పోస్ట్ చేశారు. "రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాను. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేశాను. రాబోయే రోజుల్లో భారత్-రష్యా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కలిసి పనిచేయడానికి నిర్ణయించాం" అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికలు
TASS ఏజెన్సీ నివేదిక ప్రకారం అధ్యక్ష ఎన్నికలలో పుతిన్ అద్భుతమైన విజయం సాధించారు. 70 శాతం ఎలక్టోరల్ ప్రొటోకాల్‌ల ప్రాసెసింగ్ ఆధారంగా అత్యధికంగా 87.17 శాతం ఓట్లు సాధించి, పుతిన్ దేశ నాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ 4.1 శాతం ఓట్లు పొందగా, న్యూ పీపుల్ పార్టీకి చెందిన వ్లాడిస్లావ్ దావన్‌కోవ్ 4.8 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ని ఉపయోగించారు. మొదటిసారిగా దీనిని అమలు చేశారు.
పుతిన్ అధ్యక్ష వారసత్వం
వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నిక కావడం రష్యా రాజకీయాల్లో ఆయన శాశ్వత మార్క్‌ని గుర్తు చేసింది. 2000లో ప్రారంభ ఎన్నికల నుంచి నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 20 , 2024 | 05:33 PM