ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలి: పోప్ ఫ్రాన్సిస్
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:23 AM
ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని, ఆయుధాలు మౌనం పాటించాలని, శత్రువులు సైతం మిత్రత్వం అనే బంధంలోకి రావాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు.
వాటికన్ సిటీ, డిసెంబరు 25: ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలని, ఆయుధాలు మౌనం పాటించాలని, శత్రువులు సైతం మిత్రత్వం అనే బంధంలోకి రావాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ఇరువైపులా క్రైస్తవులు ఇబ్బందులకు గురవుతున్నారని, వీటికి ముగింపు పలకాలని అభిలషించారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆయన వాటికన్‌సిటీలోని ‘హోలీ డోర్ ఆఫ్ సెయింట్ పీటర్’ ప్రార్థన మందిరం వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ అపహరించిన ఇజ్రాయెలీలను బేషరతుగా వదిలిపెట్టాలని సూచించారు.
Updated Date - Dec 26 , 2024 | 05:23 AM