Russia: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ప్రమాణం
ABN, Publish Date - May 08 , 2024 | 08:56 AM
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఆరేళ్లు రష్యా అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దీంతో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమాన్ని బహిష్కరించిన పశ్చిమ దేశాలు..
ఉక్రెయిన్‌పై యుద్ధమే కారణం
మాస్కో, మే 7: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మరో ఆరేళ్లు రష్యా అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ గెలుపొందారు. దీంతో మంగళవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. రష్యా అధ్యక్షుడిగా గానీ, ప్రధానమంత్రిగాగానీ 1999వ సంవత్సరం నుంచి పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న కారణంగా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమెరికా, బ్రిటన్ సహా అనేక పశ్చిమదేశాలు బహిష్కరించాయి.
‘పుతిన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మా ప్రతినిధిని ఎవరినీ పంపడం లేదు. రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని మేం భావించడం లేదు’ అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారమే స్పష్టం చేశారు. కెనడా, ఐరోపా సమాఖ్యలోని అత్యధిక దేశాలు కూడా పుతిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి.
ఇది కూడా చదవండి:
West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 08:56 AM